మా నాన్నకు జీతం పెంచండి : సీఎంకు ఆరేళ్ల చిన్నారి లేఖ

ఓ ఆరేళ్ల చిన్నారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసింది. మా నాన్నకి జీతం పెంచండి అని కోరుతూ ఆ లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం

  • Published By: veegamteam ,Published On : December 15, 2019 / 05:48 AM IST
మా నాన్నకు జీతం పెంచండి : సీఎంకు ఆరేళ్ల చిన్నారి లేఖ

Updated On : December 15, 2019 / 5:48 AM IST

ఓ ఆరేళ్ల చిన్నారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసింది. మా నాన్నకి జీతం పెంచండి అని కోరుతూ ఆ లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం

ఓ ఆరేళ్ల చిన్నారి మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రేకి లేఖ రాసింది. మా నాన్నకి జీతం పెంచండి అని కోరుతూ ఆ లేఖ రాసింది. తక్కువ జీతం కారణంగా తన తండ్రి ఎక్కువ సమయం విధుల్లో ఉంటున్నారని, తనతో గడపడం లేదని చిన్నారి లేఖలో తన బాధను తెలిపింది. మహారాష్ట్రలోని జల్నా ప్రాంతానికి చెందిన శ్రియా హరాలే ఈ లేఖ రాసింది. శ్రియా స్థానిక స్కూల్ లో 1వ తరగతి చదువుతోంది. శ్రియా తండ్రి అంబాద్ డిపోలో బస్ కండక్టర్ గా పనిచేస్తున్నారు. అయితే తక్కువ జీతం కారణంగా.. డబ్బు కోసం ఎక్కువ సమయం ఆయన విధుల్లోనే ఉంటున్నారు. దీంతో తన తండ్రితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని శ్రియా బాధపడుతోంది. దీంతో ఆ చిన్నారి ఏకంగా సీఎంకి లేఖ రాసింది.

సీఎంకు ఏమని లేఖ రాసిందంటే..
”సర్.. మా నాన్న నా దగ్గర ఎక్కువ సమయం గడపడం లేదు. ఆయన లేకపోవడంతో నేను సరిగా చదవలేకపోతున్నా. మీరు జీతం పెంచితే ఆయన త్వరగా ఇంటికి వస్తారు. నాతో ఎక్కువ సమయం గడిపేందుకు అవకాశం ఉంటుంది” అని మరాఠీలో లేఖ రాసింది శ్రియా. 

దీనిపౌ శ్రియా తండ్రి స్పందించారు. మా అమ్మాయి సీఎంకి లేఖ రాసిన మాట నిజమే అన్నారు. నా జీతం పెంచాలని కోరుతూ నా కుతూరు సీఎంకు లేఖ రాసిందన్నారు. ఆ లేఖను పోస్ట్ చేయమని తనకు ఇచ్చిందని చెప్పారు. తాను ఆర్డినరీ పోస్ట్ ద్వారా లేఖను పంపానని, అది సీఎంకు చేరిందో లేదో తనకు తెలియదని శ్రియా తండ్రి చెప్పారు. తన తండ్రికి జీతం పెంచాలని కోరుతూ ఓ చిన్నారి ఏకంగా సీఎంకి లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఆ లేఖ సీఎంకి చేరితే.. మరి ఆయన నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.