కరోనా మహమ్మారి వ్యాప్తి నిరోధించటానికి దేశ వ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్ మధ్య ఎల్‌పిజి సిలిండర్ ధరలు తగ్గాయి. ఆయిల్ కంపెనీలు సిలిండర్ పై సుమారు రూ. 65 తగ్గించాయి. గత కొన్ని వారాలుగా ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు పతనం కావటంతో ధరలు తగ్గించినట్లు ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
ఢిల్లీలో 14.2 కిలోల సబ్సిడీ లేని సిలిండర్ ధర ఇప్పుడు 744 రూపాయలుగా మారిందని ఇండేన్ సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.ఇంతకు ముందు ఈ సిలిండర్ ధర ఢిల్లీలో రూ .805.50 గా ఉంది. ఢిల్లీలో సబ్సిడీ రహిత సిలిండర్ రూ .61.50 తగ్గింది.
అదేవిధంగా, సబ్సిడీ లేని సిలిండర్ ధర కోల్‌కతాలో 774.50 రూపాయలు (అంతకు ముందు ధర రూ.839.5), ముంబైలో 714.50 రూపాయలు(అంతకు ముందు ధర రూ.776.5) చెన్నైలో 761.50 రూపాయలకు(అంతకు ముందు ధర రూ.826) చేరుకుంది. గత లెండు నెలల్లో సిలిండర్ ధరలు తగ్గటం ఇది రెండోసారి.
Also Read | కరోనా గుప్పిట్లో ప్రపంచమే బందీ. ఈ ప్రాంతాల్లో మాత్రం ఒక్క కరోనా కేసుకూడా నమోదుకాలేదు.