ఆపద ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. రెప్పపాటు క్షణంలోనే జరిగిపోతోంది. ఎవరూ ఊహించలేరు. ఇది వాస్తవమే కదా. ఇందుకు పక్కా ఎగ్జాంపుల్ ఈ ఘటనే అని చెప్పుకోవచ్చు. IPS Officer అరుణ్ బోత్రా Twitter లో ట్వీట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో ఏముంది ?
చిట్టడివిలా ఉంది. చిన్నపాటి రోడ్డు ఉంది. ఓ కారు ఆగి ఉండగా..ప్రకృతి పిలవడంతో ఓ మనిషి ‘ఆ పని కానిచ్చేస్తున్నాడు’. అంతలోనే ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. కారు పక్కనే ఉంచి..ఓ ట్రక్కు దూసుకపోయింది. ట్రక్ లో నుంచి పెద్ద బండరాయి కిందపడడం..అమాంతం..గాల్లోకి ఎగిరి..కారు ముందుభాగంపై పడిపోయింది.
ఇంకేముంది కారు నుజ్జునుజ్జైంది. శబ్ధం విన్న అతను వెనక్కి తిరిగి చూశాడు. తాను అదే కారులో ఉంటే ఏం జరిగేదో అని ఊహించుకోవడంతో ఒళ్లు జలదరించింది. తాను అదృష్టవంతుడినా ? దురదృష్టవంతుడినా ? అని ఆలోచిస్తున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు.
Lucky or Unlucky? pic.twitter.com/mNp6AvoAks
— Arun Bothra (@arunbothra) July 14, 2020