MP beggar telling time telling without watch
MP beggar telling time telling without watch : అతనో యాచకుడు. జనాలు ఎక్కడ ఎక్కువమంది ఉంటే అక్కడికెళ్లి భిక్షాటన చేస్తుంటాడు. కానీ అతనిలో ఉన్న టాలెంట్ గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. టైమ్ ఎంత అని ఎవరైనా అడిగితే వాచ్ చూసి చెప్తాం. లేదా ప్రస్తుత కాలంలో అన్నింటిక మొబైలే ఆధారంగా ఉంది కాబట్టి మొబైల్ చూసి చెప్తాం. కానీ మధ్యప్రదేశ్ కు చెందిన సుఖ్‌లాల్ అనే పేరుగల వ్యక్తి మాత్రం వాచ్ చూడకుండా మొబైల్ కూడా చూడకుండా టైమ్ ఎంత అయ్యిందో కరెక్ట్ గా చెప్పేస్తాడు. అతని టైమ్ చెబితే మనం మాత్రం కరెక్టా కాదా? అని చెక్ చేసుకోవటానికి వాచ్ లేదా మొబైల్ చూస్తే అతని చెప్పినదానికి సెకన్ కూడా తేడా ఉండదు. అది ఆ యాచకుడి టాలెంట్..
మధ్యప్రదేశ్ బుర్హాన్‌పూర్ జిల్లా నేపానగర్‌కు చెందిన సుఖ్‌లాల్ అనే యాచకుడి టాలెంట్ అది. అతని గురించి తెలిసివారంతా అతనిని ‘నడిచే గడియారం’ అని అంటుంటారు. సుఖ్‌లాల్ చెప్పే సమయం, గడియారంలోని సమయంతో సెకన్ కూడా తేడా లేకుండా ఉంటుందంటారు స్థానికులు.తనకున్న ఈ టాలెంట్ గురించి సుఖ్‌లాల్ ఏమంటాడంటే..ఇది ప్రకృతి గడియారం..నాకు ఒక్కడికి మాత్రమే కనిపిస్తుంది..ఇంకెవరికి కనిపించదు అని చెప్తాడు. భిక్షాటన చేస్తూ ఒంటరిగా జీవించే సుఖ్‌లాల్.. రైల్వే స్టేషన్ బస్ స్టేషన్లతో పాటు జనాలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో యాచకుడిగా జీవిస్తున్నాడు.