Madhya Pradesh Boy : ఆన్‌లైన్ క్లాసులో పేలిన ఫోన్.. 15ఏళ్ల విద్యార్ధికి గాయాలు..

అసలే కరోనా కాలం.. మహమ్మారి సమయంలో స్కూళ్లకు నేరుగా వెళ్లి చదువుకునే పరిస్థితులు కావు.. అంతా ఆన్ లైన్‌లోనే చదువులు కొనసాగుతున్నాయి.

Mobile Explode Online Class : అసలే కరోనా కాలం.. మహమ్మారి సమయంలో స్కూళ్లకు నేరుగా వెళ్లి చదువుకునే పరిస్థితులు కావు.. అంతా ఆన్ లైన్‌లోనే చదువులు కొనసాగుతున్నాయి. కరోనా దెబ్బకు లాక్ డౌన్లు విధించడంతో స్కూళ్లు, కాలేజీలు అన్ని మూతపడ్డాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ ఉంటే చాలు.. ఇంట్లోనే కూర్చొని ఆన్ లైన్ క్లాసులను వింటున్నారు. గంటల పాటు ఆన్ లైన్ క్లాసులతోనే గడిపేస్తున్నారు విద్యార్థులు. ఆన్ లైన్ క్లాసులు వినాలంటే స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్ టాప్ ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో ఈ ఎలక్ట్రానిక్ పరికరాల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా జిల్లాకు చెందిన 15ఏళ్ల విద్యార్థి ఆన్ లైన్ క్లాసు వింటుండగా.. చేతిలో మొబైల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో ఆ విద్యార్థికి గాయాలు అయినట్టు మధ్యప్రదేశ్ పోలీసులు వెల్లడించారు. జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ల దూరంలోని చాంద్ కుయా గ్రామంలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. 8వ తరగతి చదువుతున్న 15ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్లో ఆన్ లైన్ క్లాసులు వింటున్న సమయంలో ఆకస్మాత్తుగా మొబైల్ ఫోన్ పేలిపోయిందని పోలీసులు తెలిపారు.

ఈ ప్రమాదంలో బాలుడి దవడికి గాయాలు అయినట్టు నాగోద్ పోలీసు స్టేషన్ ఇన్ స్పెక్టర్ ఆర్పీ మిశ్రా వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో బాలుడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడని, తల్లిదండ్రులు ఎవరులేరని తెలిపారు. ఇంట్లో నుంచి భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారు ఇంట్లోకి పరిగెత్తుకొచ్చారు. అనంతరం పోలీసులకు సమాచారాన్ని అందించినట్టు ఎస్పీ మిశ్రా చెప్పారు. సాత్నా జిల్లా ఆస్పత్రికి బాలుడిని తరలించి చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం జబల్ పూర్ ఆస్పత్రికి తరలించినట్టు మిశ్రా పేర్కొన్నారు.

Read Also : Students Suicide : విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఇంటర్‌ ఫలితాలు

ట్రెండింగ్ వార్తలు