Students Suicide : విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఇంటర్‌ ఫలితాలు

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్‌ తమ ప్రాణాలు తీసుకున్నారు.

Students Suicide : విద్యార్థుల ప్రాణాలు తీస్తున్న ఇంటర్‌ ఫలితాలు

Suicide

intermediate exams results : తెలంగాణలో నిన్న విడుదలైన ఇంటర్‌ ఫలితాలు కొందరు విద్యార్థుల పాలిట మరణశాసనంగా మారుతున్నాయి. ఈ ఫలితాలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుస్తున్నాయి. కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్‌లో ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్‌కు చెందిన ధనుష్‌ తమ ప్రాణాలను తీసుకున్నారు.

నల్గొండకు చెందిన జాహ్నవి ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిలైంది. దీంతో తనకిక జీవితమే లేదనుకుంది. అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. నిన్న ఫలితాలు విడుదలయ్యాక తాను ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయినట్టు తెలుసుకుంది జాహ్నవి.. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పింది. దీంతో ఇంట్లో తల్లిదండ్రులు ఏం జరిగింది? ఎందుకు ఫెయిల్‌ అయ్యావు? అంటూ జాహ్నవిని ప్రశ్నించారు. దీంతో ఏం సమాధానం చెప్పలేకపోయింది. తనలో తానే కుమిలిపోయింది. బాగానే చదివే నేను ఎందుకు ఫెయిల్‌ అయ్యానన్న ప్రశ్న వెంటాడిందో ఏమో అందరూ పడుకున్నాక రైల్వే ట్రాక్‌పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

CM KCR : రైతులందరికీ రైతుబంధు ఇస్తాం : సీఎం కేసీఆర్

జాహ్నవి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.. జాహ్నవి బాగా చదువుతుందని.. కానీ ఎందుకు ఫెయిల్ అయ్యిందో అర్థం కావడం లేదన్నారు కుటుంబ సభ్యులు.. రాత్రి వరకు తమతోనే ఉందని.. తెల్లారి లేచే సరికి జాహ్నవి కనిపించలేదన్నారు.. తన కోసం వెతుకుతుండగానే రైల్వే ట్రాక్‌పై జాహ్నవి మృతదేహం ఉందన్న సమాచారం వచ్చిదంటూ రోదిస్తూ తెలిపారు..

ఇక నిజామాబాద్‌కు చెందిన ధనుష్‌ కూడా ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నాడు.. ఇంటర్‌లో ఫెయిల్‌ అయ్యానన్న తీవ్ర మనస్థాపంతో ధనుష్‌ అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు.. ధనుష్‌ మృతితో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి..

Kadapa Tour : సీఎం జగన్ కడప జిల్లా టూర్.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

విద్యార్థుల ఆత్మహత్యలు వారిళ్లలో తీవ్ర విషాదం నింపాయి. తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పిల్లలపై మార్కుల ఒత్తిడి వల్లే ఇలా జరుగుతోందని నిపుణులు అంటున్నారు. తక్కువ మార్కులు వచ్చినా, ఫెయిల్ అయినా నలుగురిలో పరువు పోతుందనో, స్నేహితులు హేళన చేస్తారనో, తల్లిదండ్రులు తిడతారనో.. ఇలాంటి భయాలతో తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు.

మరోవైపు ఈ సారి ఇంటర్‌ ఫలితాల్లో కేవలం 49 శాతం మాత్రమే ఉత్తీర్ణత శాతం నమోదవ్వడం కూడా వివాదస్పదమైంది.. ఇంటర్‌ బోర్డు కఠిన వైఖరి వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.. వెంటనే ఫెయిలైన విద్యార్థుల పేపర్లను ఉచితంగా రీ వాల్యూయేషన్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి..

Pawan Kalyan : విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్ ఉద్యమం

ఏదీ ఏమైనా జీవితం అంటే ఫస్ట్ ర్యాంకులు, మార్కులే కాదనే విషయాన్ని విద్యార్థులు గ్రహించలేకపోతున్నారు. క్షణికావేశంలో వారు తీసుకునే నిర్ణయం వారి కుటుంబాలను ఎంతో మనోవేదనకు గురి చేస్తుందో గుర్తించలేకపోతున్నారు.. ఎంతో భవిష్యత్తు ఉన్న వారు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు.