Madhya pradesh election 2023: 59 వాగ్దానాలు, 101 గ్యారంటీలు.. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో కీలక హామీలు ఇవే..

మ్యానిఫెస్టోలో కీలక అంశాలపై కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చింది. అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది.

Madhya Pradesh Congress manifesto

Madhya Pradesh Congress Manifesto : మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నవంబర్ 17న జరగనుంది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అన్నిప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. మొత్తం 59 వాగ్దానాలు, 101 ప్రధాన గ్యారంటీలతో కూడిన 106 పేజీల మ్యానిఫెస్టోను మంగళవారం భోపాల్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్ కమల్ నాథ్ విడుదల చేశారు. ఈ మ్యానిఫెస్టోలో కీలక అంశాలపై హామీలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపడతామని, అంతేకాక.. ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది.

Read Also : Durga Puja Pandals : దుర్గాపూజ మండపాలకు ప్రభుత్వ గ్రాంట్…అసోం సర్కారు నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలివే..

– అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కులగణన చేపడతామని హామీ.
– రాష్ట్రంలో ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్లు.
– మహిళలకు నెలకు రూ. 1,500 ఆర్థియ సాయం
– రైతులకు రూ. 2లక్షల వరకు రుణమాఫీ
– గృహ వినియోగదారులకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్.
– 200 యూనిట్ల వరకు సగం ధరకే కరెంట్ సరఫరా
– సాగు అవసరాలకోసమైతే 5హెచ్పీ మోటారుకు ఉచిత కరెంట్
– రైతుల పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లుల మాఫీ
– రైతు ఆందోళనలు, విద్యుత్ సంబంధ తప్పుడు కేసులు ఎత్తివేత
– గోధుమ పంట క్వింటాలుకు కనీస మద్దతు ధర రూ. 2,600.
– వరి ధాన్యం కనీసం మద్దతు ధర క్వింటాకు రూ. 2,500.
– ఉద్యోగులకు పాత పింఛను పథకం వర్తింపు.
– దివ్యాంగులకు నెలకు రూ.2వేల పింఛను

– రూ. 500కే ఎల్పీజీ సిలిండర్.
– రూ. 10లక్షల ప్రమాద బీమాతో కలిపి రాష్ట్ర ప్రజలందరికీ రూ. 25లక్షల వరకు ఆరోగ్య బీమా కవరేజీ
– యువతకు రెండేళ్లపాటు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ. 1500 నుంచి రూ. 3వేల వరకు అందజేత.
– మధ్యప్రదేశ్ తరపున ఐపీఎల్ జట్టు ఉండేలా హామీ.
– ఒలంపిక్, వరల్డ్ కప్, ఆసియాడ్, కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన వారికి నేరుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశం.
– పడో.. పదావో ( చదువు.. చదివించు) పథకం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు నెలకు రూ. 500 చెల్లింపు. అదేవిధంగా 9, 10 తరగతుల విద్యార్థులకు రూ. వెయ్యి. ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ. 1,500.
– గిరిజనుల కోసం నోటిఫైడ్ ట్రైబల్ ఏరియాల్లో పంచాయతీల చట్టం అమలు. తునికాకు సేకరించేవారికి స్టాండర్డ్ బ్యాగ్ కు రూ. 4వేల చొప్పున చెల్లింపు.
– అన్నివర్గాల ప్రజలకు 600 చదరపు అడుగుల స్థలాన్ని ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం.

 

ట్రెండింగ్ వార్తలు