తండ్రి మృతదేహాన్ని రెండు భాగాలుగా చేసి తనకు ఓ భాగం ఇవ్వాలని అంత్యక్రియలకు అడ్డుపడ్డ వ్యక్తి

ఈ ఘటన ఆ గ్రామవాసుల్లో కలకలం రేపింది.

ఓ వ్యక్తి తన తండ్రి అంత్యక్రియలు జరుగుతుండగా అడ్డుపడ్డాడు. తన తండ్రి మృతదేహంలోని కోసి సగ భాగం తనకు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ జిల్లాలో చోటుచేసుకుంది.

తండ్రి అంత్యక్రియల విషయంలో జరిగిన వివాదం కారణంగా అతడు ఈ పని చేశాడు. చివరకు పోలీసులు అక్కడికి వచ్చి గొడవను సద్దుమణిగేలా చేశాడు. లిధోరతాల్ గ్రామంలో జరిగిన ఈ ఘటన గురించి పోలీస్ అధికారి అర్వింద్ సింగ్ వివరాలు తెలిపారు.

Also Read: భార్య చెల్లెలిపై అతి దారుణానికి పాల్పడ్డ వ్యక్తి.. లోన్‌ తీసుకుని మరీ రౌడీలను రప్పించి ఏమేం చేశాడో తెలుసా?

ధ్యానీ సింగ్ ఘోష్ (84) అనే వృద్ధుడు తన చిన్న కొడుకు దేశ్‌రాజ్‌తో కలిసి ఉండేవాడు. ఘోష్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందాడు. ఘోష్ మృతిచెందాడని తెలిసిన వెంటనే పెద్ద కుమారుడు కిషన్ అక్కడికి చేరుకున్నాడు.

తన తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని కిషన్ గొడవ చేశాడు. తన తండ్రి అంత్యక్రియలను తానే నిర్వహిస్తానని చిన్న కుమారుడు దేశ్‌రాజ్‌ అన్నాడు. ఇదే తన తండ్రి కోరిక అని దేశ్‌రాజ్‌ చెప్పాడు.

ఆ సమయంలో కిషన్‌ మద్యం మత్తులో ఉన్నాడు. తండ్రి మృతదేహాన్ని అర్ధ భాగం చేయాలని, తన తమ్ముడికి, తనకు సగం సగం పంచాలని కిషన్‌ పట్టుబట్టాడు. గొడవ గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కిషన్‌ను సముదాయించి అక్కడి నుంచి పంపించారు. చివరికి చిన్న కుమారుడు దేశ్‌రాజ్ అంత్యక్రియలను చేశాడు.