Madhya Pradesh : కూతురి కోసం సెల్ ఫోన్ కొని..భాజాభజంత్రీలతో ఊరేగింపు

శివపురి పట్టణంలోని ఓ ప్రాంతంలో మురారీ కుష్వాహా కుటుంబం నివాసం ఉంటోంది. ఇతను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

Madhya Pradesh Tea Seller :  ఐదేళ్ల కూతురి కోసం ఓ వ్యక్తి సెల్ ఫోన్ కొన్నాడు. అందులో విశేషం ఏమి ఉంది అని అనుకుంటున్నారా. కొనుగోలు చేసిన అనంతరం దుకాణం నుంచి ఇంటి వరకు భాజాభజంత్రిలతో అందంగా అలంకరించిన గుర్రపు బండిపై కూతురిని ఎక్కించుకుని ఊరేగింపుగా వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన సోమవారం రాత్రి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

Read More : Property Dispute : ఆస్తి కోసం తల్లిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్ళిన మున్సిపల్ చైర్మన్

శివపురి పట్టణంలోని ఓ ప్రాంతంలో మురారీ కుష్వాహా కుటుంబం నివాసం ఉంటోంది. ఇతను టీ అమ్ముతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని ఐదేళ్ల కూతురు సెల్ ఫోన్ చేతిలో పట్టుకోగా…తోబుట్టువులు లైట్లతో అలంకరించబడిన గుర్రపై బండిపై కూర్చొన్నారు. గుర్రం బండి ఎదురుగా డప్పులు వాయిస్తుండడం, లౌడ్ స్పీకర్ లలో పాట వస్తుంటే..ఇతరులు డ్యాన్స్ లు చేశారు.

Read More : Indian Railways : ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం, ప్యాసింజర్లకు డిస్పోజబుల్‌ బెడ్‌ షీట్లు

ఇది తన కుటుంబానికి తొలి స్మార్ట్ ఫోన్ అంటూ వెల్లడించారు. దీని ధర రూ. 12 వేల 500గా ఉందని తెలుస్తోంది. ఊరిగింపులో బాణాసంచా కూడా కాల్చారు. ఊరేగింపు ఇంటికి చేరుకున్న అనంతరం స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. తన ఐదేళ్ల కూతురు చాలా కాలంగా మొబైల్ ఫోన్ కొనివ్వాలని అడుగుతోందని…అతను వెల్లడించాడు. అయితే..మొబైల్ ఫోన్ కొనేందుకు అవసరమైన మొత్తం తక్కువగా ఉండడంతో రుణం తీసుకుని..కొనుగోలు చేసేందుకు అనుమతినిచ్చినట్లు దుకాణ యజమాని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు