“మహా లేఖ”దుమారం..సుప్రీంని ఆశ్రయించిన పరమ్ బీర్ సింగ్

జీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు పరమ్​బీర్​ సింగ్.

param bir singh మాజీ ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సోమవారం(మార్చి-22,2021)సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఎన్పీసీ నేత, మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై తాను చేసిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు పరమ్​బీర్​ సింగ్. హోంమంత్రిపై తాను చేసిన అవినీతి ఆరోపణలపై పక్షపాతం లేని,ప్రభావితం కాని,నిస్పక్షపాతమైన,న్యాయబద్దమైన దర్యాప్తు చేయించాలని పరమ్ బీర్ సింగ్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

అంతేకాకుండా, ముంబై పోలీస్​ కమిషనర్​గా తనను తప్పించి… హోంగార్డ్​ విభాగానికి బదిలీ చేయడాన్ని కూడా సవాల్​ చేశారు పరమ్​బీర్. తనను బదిలీని చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కూడా కొట్టివేయాలని సింగ్ పిటిషన్ లో కోరారు. తన బదిలీని ఏకపక్షమైనది మరియు అక్రమమైనదని పరమ్ బీర్ సింగ్ పేర్కొన్నారు. కాగా ,అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు నేపథ్యంలో.. గత శుక్రవారం ముంబై పోలీస్‌ కమిషనర్‌ పరమ్‌బీర్‌ సింగ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే. పరమ్‌బీర్‌ సింగ్‌ స్థానంలో హేమంత్‌ నగ్రాలేను ముంబై పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వం నియమించింది.

దేశ్ ముఖ్ కు మద్దతుగా నిలిచిన పవార్

ఇవాళ ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్..హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ ను మద్దతుగా నిలిచారు. హోంమంత్రి కుర్చీ నుంచి అనిల్ దేశ్ ముఖ్ ను తొలగించే ప్రశక్తే లేదని పవార్ తేల్చిచెప్పారు. శరద్ పవార్ మాట్లాడుతూ..ఇక్కడ ముఖ్యమైన అంశం అంబానీకి బెదిరింపు కేసు. ఈ ఘటనలో ఏటీఎస్ అధికారులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. దీంతో అంబానీకి బాంబు బెదిరింపు కేసుతో సంబంధం ఉన్న మన్ సుఖ్ హిరేన్ ను ఎవరు చంపారో సృష్టత వచ్చింది. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటపడతాయి. ముంబై ఏటీఎస్ దర్యాప్తు సరైన దారిలో సాగుతోంది. అయితే దాన్ని తప్పుబట్టించేందుకే పరమ్ బీర్ పింగ్ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. పరమ్ బీర్ సింగ్ సీఎంకి రాసిన​ లేఖను పరిశీలిస్తే.. ప‌బ్బులు, రెస్టారెంట్ల నుంచి నెల‌కు రూ.100 కోట్లు వ‌సూల్ చేయాల‌ని ఫిబ్రవరి మధ్యలో తమకు హోంమంత్రి ఆదేశాలు ఇచ్చారని చెప్పినట్లు పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 6 నుంచి 16వ తేదీ వరకు అనిల్ దేశ్​ ముఖ్​ కరోనా బారినపడి హాస్పిటల్ లో చేరారు. ఆరోపణలు చేసిన సమయంలో హోంమంత్రి ఆసుపత్రిలో ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఆరోపణలకు ఎలాంటి బలం లేదు. అవి నిరాధారమైనవని తేలింది. కాబట్టి అనిల్ దేశ్ ముఖ్ ను హోంమంత్రిగా తప్పించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ విఫయంలో శివసేన నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని పవార్ సృష్టం చేశారు.

మరోవైపు, పరమ్ బీర్ సింగ్ ఆరోపణలపై హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్ స్పందించారు. తాను ఫిబ్రవరి 15 నుంచి 27 వరకు హోమ్​ క్వారంటైన్​లో ఉన్నట్లు అనిల్​ దేశ్​ముఖ్ తెలిపారు. ఫిబ్రవరి 28నే తన ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు చెప్పారు. అయితే.. హాస్పిటల్ నుంచి ఫిబ్రవరి 15న డిశ్చార్జ్​ అయినప్పుడు కొంతమంత్రి జర్నలిస్టులు గేట్​ వద్ద ఉన్నారని, తాను నీరసంగా ఉన్న కారణంగా అక్కడే కుర్చీలో కూర్చొని వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చానన్నారు. ఆ తర్వాత నేరుగా కారులో ఎక్కి ఇంటికి వెళ్లానని తెలిపారు.

అసలు పరమ్ బీర్ సింగ్ లేఖ ఏంటి?

హోంమంత్రి అనిల్​ దేశ్​ముఖ్​ తన పదవిని దుర్వినియోగం చేశారని ఆరోపిస్తూ పరమ్​బీర్​ సింగ్​ సీఎం ఉద్దవ్ ఠాక్రేకి శనివారం ఓ లేఖ రాశారు. నెలకు​ రూ.100 కోట్లు సంపాదించాలని ముఖేష్ అంబానీకి బెదిరింపు కేసులో అరెస్ట్ అయిన మాజీ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ సచిన్​ వాజేకు అనిల్ దేశ్​ముఖ్ ఫిబ్రవరి మధ్యలో ఆదేశాలు జారీ చేశారని అన్నారు. బార్లు, హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూల్ చేయాలని చెప్పినట్లు ఆ లేఖలో సింగ్ తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు