Heavy Rains : మ‌హారాష్ట్ర‌ను ముంచెత్తిన వరదలు.. మ‌రాఠ్వాడాలో 10 మంది మృతి

మహారాష్ట్రలో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు.

heavy rains in Marathwada : మహారాష్ట్రలో భారీవర్షాలు దంచికొడుతున్నాయి. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలతో అక్కడి ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌ కార‌ణంగా మ‌హారాష్ట్ర‌లోని మ‌రాఠ్వాడా ప్రాంతంలో గత 48 గంటల్లో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200పైగా ప‌శువులు కొట్టుకుపోయాయి. వరద ఉధృతికి ప‌లు ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. మ‌రాఠ్వాడా ప్రాంతంలో ఎనిమిది జిల్లాలు, 180 స‌ర్కిళ్ల‌లో రికార్డు స్థాయిలో 65 మిల్లీమీట‌ర్ల వరకు వ‌ర్షం కురిసింది.
Gang Clash in Prison : జైల్లో గ్యాంగ్ వార్..24 మంది ఖైదీలు మృతి..48మందికి గాయాలు

అయితే మ‌ర‌ణించిన 10 మందిలో మ‌రాఠ్వాడా ప్రాంతంలోని ఆరు జిల్లాల‌కు చెందినవారే ఉన్నారు. బీడ్ జిల్లాకు చెందిన ముగ్గురు, ఉస్మానాబాద్‌, ప‌ర్భ‌ణి జిల్లాల‌కు చెందినవారు ఇద్ద‌రు ఉన్నారు. జ‌ల్నా, నాందేడ్‌, లాటూర్ జిల్లాల‌కు చెందిన ఒక్కొక్క‌రు వరదల్లో మృతిచెందారు. రాష్ట్రంలోని మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఔరంగాబాద్, లాతూర్, ఉస్మానాబాద్, పర్భానీ, నందేడ్, బీడ్, జలన్హా, హింగోలి ప్రాంతాల్లో భారీగా ఇళ్లు దెబ్బతిన్నాయి. మిగితా రెండు జిల్లాలైన ఔరంగాబాద్‌, హింగోలిలో మ‌ర‌ణాలు నమోదు కాలేదు.

గత రెండు రోజుల్లో మొత్తం 205 పశువులు కొట్టుకుపోగా.. అందులో 60కిపైగా పెద్దవే ఉన్నాయి. అంతేకాదు.. పంటలు కూడా వరద తాకిడికి నీటమునిగాయి. పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. నీటి వనరుల శాఖ వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తోంది. వరదబాధిత ప్రాంతాల్లోని నివాసులకు అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నట్టు అధికారులు తెలిపారు.
Bandi Sanjay Padayatra : హుజూరాబాదా..? హుస్నాబాదా..? ప్రజా సంగ్రామ యాత్ర ముగింపుసభ ఎక్కడ?

ట్రెండింగ్ వార్తలు