13 Maoists Killed In Police Encounter
13 Maoists killed in police encounter : మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మరోసారి తుపాకుల మోత మోగింది. పోలీసులకు..మావోయిస్టులకు మధ్య భీకరంగా ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 13మంది మావోలు హతమయ్యారు. శుక్రవారం (మే21,2021) ఉదయం తూర్పు విదర్భలోని అడవిలో పైడి-కోట్మి మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఓ గ్రామ సమీపంలో మావోయిస్టులు శిబిరం వేసుకున్నారన్న సమాచారంతో సి-60 కమాండోలు అక్కడికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా మావోయిస్టులు-పోలీస్ కమాండోల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 13 మంది మావోలు హతమయ్యారు. ఆ ప్రాంతంలో గాలింపు జరిపిన పోలీసులు మారణాయుధాలు, పేలుడు పదార్థాలు, మావోయిస్టు సాహిత్యం, ఇతర నిత్యావసరాలను స్వాధీనం చేసుకున్నారు.
మావోయిస్టు కసన్‌సూర్ దళం బీడీ ఆకుల కాంట్రాక్ట్ విషయమై గ్రామస్థులతో సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు. దీంతో ఇరు వర్గాల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. కాల్పులు ఆగిన అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 13 మంది మావోలు హతమైనట్టు గుర్తించారు. కొన్ని గంటలుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.
https://youtu.be/TbZZdJvckkY