Maharashtra Bandh : మహారాష్ట్రలో కొనసాగుతున్న బంద్, 8 బస్సులు ధ్వంసం!

మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో 8 బస్సులు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.

8 BEST Buses Vandalised : మహారాష్ట్రలో బంద్ కొనసాగుతోంది. దేశ వాణిజ్య నగరంగా పేరొందిన ముంబైలో 8 బస్సులు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. దుకాణాలు మూతపడ్డాయి. పూణే – బెంగళూరు జాతీయ రహదారిని దిగ్భందం చేశారు. రైతులకు సంఘీభావం ప్రకటించాలని శివసేన, ఎన్ సీపీ, కాంగ్రెస్ సభ్యులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే..బంద్ లో అత్యవసర సేవలను మినహాయించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని MVA డిమాండ్ చేస్తోంది. ఈ బంద్ లో శివసేన పూర్తిస్థాయిలో పాల్గొంటుందని రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ వెల్లడించారు.

Read More : Wallet 51 Years Ago : 1970లో పోయిన అరుదైన పర్సు..వెతికి యజమానికి అప్పగించిన పోలీసులు..

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ లో శాంతియుతంగా నిరసన ప్రదర్శన చేస్తున్న నలుగురు రైతులు చనిపోయిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రైతులను బహిరంగంగా బెదిరించారని, మంత్రి కుమారుడే తమపైకి వాహనం నడిపాపారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దీనిపై ముంబై వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వంలోని భాగస్వాములైన శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్..లు మహారాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. అక్టోబర్ 11వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని ఆ పార్టీలు పిలుపునిచ్చాయి.

Read More : Tamil Nadu : పొగడ్తలు వద్దు..తప్పు ఉంటే ఎత్తి చూపండి, మీడియాకు సూచన

బృహన్ ముంబాయి ఎలక్ట్రిసిటీ సప్లై, ట్రాన్స్ పోర్టు (BEST) ప్రకారం…అర్ధరాత్రి నుంచి మొదలుకుని 2021, అక్టోబర్ 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల మధ్య ముంబాయిలోని వివిధ ప్రాంతాల్లో 8 బస్సులను ధ్వంసం చేశారని తెలుస్తోంది. ముంబాయి మెట్రో పాలిటన్ రీజియన్ (MMR)లో లోకల్ రైలు సర్వీసు యదావిధిగా నడుస్తోంది. శివసేన కార్యకర్తలు చెంబూరు రహదారిని దిగ్భందం చేశారు. ముంబాయిలోని హిందమత, దాదర్, లాల్ బాగ్, పరేల్ మార్కెట్లు మూతపడ్డాయి. నవీ ముంబాయి, నాసిక్ లోని AMPC మార్కెట్లు కూడా మూతపడ్డాయి.

Read More : Taliban Drugs : డ్రగ్స్ బానిసలకు అన్నం పెట్టడం లేదు, గుండ్లు గీయిస్తున్నారు..తాలిబన్ల అరాచకం

బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. దసరా సందర్భంగా నవరాత్రి వేడుకల్లో భాగంగా…స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (SRPF) మూడు కంపెనీలు, 500 మంది హోం గార్డ్ సిబ్బంది, స్థానిక వివిధ విభాగాల నుంచి 400 మంది బందోబస్తుకు నియమించారు. బంద్ కారణంతో…వీరిని అదనపు సిబ్బందిగా ముంబాయి పోలీసులు ఉపయోగించుకుంటున్నారు.

Read More : Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం

ఈ బంద్ కు తొలుత మహారాష్ట్ర ఫెడరేషన్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యతిరేకించింది. అనంతరం బంద్ కు మద్దతు ప్రకటించింది. రైతుల హత్యకు నిరసనగా..మహారాష్ట్ర వికాస్ అఘాడి ప్రభుత్వం చేపట్టిన బంద్ కు మద్దతు ఇస్తున్నట్లు, సాయంత్రం 4 గంటల వరకు దుకాణాలను మూసివేయాలని నిర్ణయించడం జరిగిందని అసోసియేషన్ సమాఖ్య అధ్యక్షుడు వీరేన్ షా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు