Wallet 51 Years Ago : 1970లో పోయిన అరుదైన పర్సు..వెతికి యజమానికి అప్పగించిన పోలీసులు..

ఎప్పుడో 1970లో పోయిన ఓ పర్సుని కనిపెట్టారు పోలీసులు. ఆ పర్సు గల వ్యక్తికి అందజేసిన వార్త వైరల్ గా మారింది.

Wallet 51 Years Ago : 1970లో పోయిన అరుదైన పర్సు..వెతికి యజమానికి అప్పగించిన పోలీసులు..

Wallet 51 Years Ago

US police returned lost wallet in 1970 to the owner : మనం ఏదన్నా వస్తువు పోగొట్టుకుంటే అది దొరుకుతుందనే ఆశ పోగొట్టుకోవాల్సిందే. ఆ పోయినది ఎంత విలువైనదైనా, అరుదైనదైనా, అపురూపమైనది తిరిగి దొరుకుతుందనే ఆశ ఉండదు. అటువంటి వస్తువేదైనా పోగొట్టుకుంటే పోలీసులకు ఫిర్యాదు చేస్తే..వాళ్లు పెద్దగా పట్టించుకుంటారా? పైగా అదే ఏ పర్సో లేదా పెన్నో అయితే పోలీసులు ఏమాత్రం పట్టించుకోరు. సరికదా..మాకుండే కేసులతోనే మేం నానా పాట్లు పడుతుంటే నీ పర్సు వెతికి పెట్టాలా? ఫో పోవయ్యా అంటారు. కానీ అమెరికాలో పోలీసులు అలా అనుకోలేదు. 51 ఏళ్ల క్రితం ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్సుని ఎంతో శ్రమించి వెతికి సదరు వ్యక్తికి తెచ్చిచ్చారు.దీంతో అతని సంతోషం అంతా ఇంతా కాదు.

సాధారణంగా పోలీసులంటే అవినీతి, డబ్బులు ముట్టజెప్పనిదే ఏమీ చేయరనే అనుకుంటాం. కానీ అమెరికాలోని కాన్సాస్ పోలీసుల నిజాయితీ గురించి తెలిస్తే మాత్రం పోలీసుల్లో ఇటువంటి నిజాతీయితీ గలవారు ఉంటారని కచ్చితంగా అనుకుంటాం. కాన్సాస్ పోలీసులు51 సంవత్సరాల క్రితం ఓ వ్యక్తి పోగొట్టుకున్న పర్స్‌ని కనిపెట్టి తెచ్చిచ్చారు. కాన్సాస్ పోలీసులు పర్స్ పోగొట్టుకున్న వ్యక్తి అడ్రస్ కనిపెట్టి మరీ అతనికి ఆ పర్సు అందజేసిన వార్త తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో షేర్ చేయటంతో ఈ వార్త వైరల్ అవుతోంది.1970 సంవత్సంరలో ఓ వ్యక్తి తన పర్స్ పోగొట్టుకున్నాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. కానీ, పోలీసులు ఆ పర్స్‌ను కనిపెట్టటానికి చాలా తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఫలితం లేదు. ఆ పర్సు దొరకలేదు. ఆ తరువాత ఆ వ్యక్తి కూడా ఇక ఆ పర్సు దొరుకుతుందనే ఆశ వదిలేశారు. నా పర్సు దొరికిందా సార్? అని పోలీసుల్ని అడగటం మానేశాడు.

Read more : Police: పది నిమిషాల్లో పోయిన ఫోన్ పట్టేసుకున్న పోలీసులు

అలా ఒకటీ రెండీ కాదు..ఐదు దశాబ్దాలు దాటిపోయాయి. పర్సు గురించి మర్చిపోయుంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తికి ఓ పర్సు దొరుకగా దాన్ని తీసుకొచ్చి గ్రేట్ బెండ్ పోలీస్ అధికారులకు అప్పగించాడు. పోలీసులు దానిని ఓపెన్ చేసి చూశారు.దాంట్లో సోషల్ సెక్యురిటీ కార్డులు, డ్రైవింగ్ లైసెన్స్‌ వంటి ఇతర కార్డులు ఉన్నాయి. ఆ కార్డుల ఆధారంగా.. ఈ వాలెట్ యజమాని ఎవరనేది కనిపెట్టే ప్రయత్నం చేశారు పోలీసులు. ఆ పర్సులమీద ఉన్న అడ్రస్ ఆధారంగా అతని గురించి తెలుసుకునే యత్నం చేశారు. కానీ ఈపర్సు పోగొట్టుకుని అప్పటికే 50 ఏళ్లు దాటిపోయాయి. ఈక్రమంలో సదరు వ్యక్తి అడ్రస్ మారాడు.

అయినా పోలీసులు అతని అడ్రస్ తెలుసుకునే యత్నాలు మానలేదు. పదే పదే అతని కోసం తీవ్రంగా గాలించారు. అతని పాత అడ్రస్ చుట్టుపక్కల వారిని అడిగారు. కానీ ఫలితంలేదు. అలాని పోలీసులు అతని అడ్రస్ తెలుసుకునే యత్నాలు మానలేదు.అలా పట్టువదలకుండా తీవ్రంగా యత్నించగా..ఎట్టకేలకు అతని ఆచూకీ కనిపెట్టారు.కాన్సాస్‌లోని లారెన్స్‌లో నివాసం ఉంటున్నాడని గుర్తించి.. పర్స్‌ను పోలీసులే స్వయంగా తీసుకెళ్లి అతనికి అప్పగించారు.ఇక్కడ విశేషం ఏంటంటే.. ఈ పర్స్ గురించి అతను ఎప్పుడో మర్చిపోయాడు. తన పర్స్ ఎప్పుడు చోరీకి గురైందో కూడా అతనికి గుర్తే లేదు. తన ఇంటికి పోలీసులు రావటంతో తన పోయిన పర్సు పోగొట్టుకోవటం వంటివి పోలీసులనే అతనికి గుర్తు చేశారు. ఇదిగో మీరు పోగొట్టుకున్న ఆ పర్సు..ఈ కార్డులు చూస్తే మీకు అవన్నీ గుర్తుకొస్తాయి అని చూపెట్టారు.

Read more : Men serving Tea: ఆడాళ్లకు టీ సర్వ్ చేయడం.. మహిళలు పిజ్జా తినడం టీవీల్లో సెన్సార్

అప్పుగు అతనికి అవన్నీ గుర్తుకొచ్చాయి. ముఖ్యంగా ఆ పర్సు చూడగానే గుర్తు పట్టాడు. ఆ పర్స్‌ను తనకు తిరిగి ఇవ్వడంతో సదరు వ్యక్తి ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోయాడు. ఈ పర్స్‌ను చేతుల్లోకి తీసుకుని దాన్ని తడిమి తడిమి చూసుకున్నాడు. తరువాత ఆ వ్యక్తి పోలీసులకు మనసారా ధన్యవాదాలు చెప్పాడు.ఈ పర్సుని నేనే స్వయంగా తయారు చేసుకున్నానని అది పోయిన చాలా కాలం నేను చాలా బాధపడ్డానని పోలీసులకు తెలిపాడు. తన పర్స్ ఇన్నాళ్టికి దొరకడంతో అతని సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ అరుదైన ఘటనను పోలీసులు దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వార్త వైరల్ గా మారింది.

పోలీసుల నిజాయితీకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. ఈరోజుల్లో పోలీసులు ఇంత నిజాయితీగా డ్యూటీ పట్ల ఇంతటి నిబద్ధతతో పనిచేయటం చాలా గొప్ప విషమని అంటున్నారు. ఎవరికైనా పాత వాలెట్ దొరికితే దాన్ని అస్సలు పట్టించుకోరు. అటువంటిది..ఆ పర్స్ యజమాని అడ్రస్‌ని కనిపెట్టి.. అతనికి చేరవేయడం గ్రేట్ అంటున్నారు నెటిజన్లు.