Maharashtra Bus Accident
Maharashtra Bus Accident: మహారాష్ట్ర రాయగఢ్ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించగా, 25 మందికి గాయాలయ్యాయి. పూణె – రాయ్‌గఢ్ సరిహద్దులో శనివారం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పూణెలోని పింపుల్ గురవ్ నుంచి గోరేగాంకు బస్సు వెళ్తుంది. గోరేగాం ప్రాంతానికి చెందినవారు పూణేలో ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి స్వస్థలానికి బస్సులో వెళ్తున్నారు. ఇందులో 41 మంది ఉన్నారు. పూణె – రాయ్‌గఢ్ హైవేపై ఖోపోలి ప్రాంతం షింగ్రోబా దేవాలయం సమీపంలో బస్సు అదుపు తప్పి కాల్వలో పడిపోయింది.
Road Accident : విజయవాడలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి మూడేళ్ల బాలుడు మృతి
ఈ బస్సు ప్రమాదంలో అక్కడికక్కడే ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు ఆస్పత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. 25 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం రెస్క్యూ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, రెస్క్యూ అధికారులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. వెంటనే క్షతగాత్రులను అంబులెన్సు సహాయంతో ఆస్పత్రికి తరలించారు.
Dehradun Fire Accident : బాబోయ్.. బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్, నలుగురు సజీవదహనం
బస్సు ప్రమాదం ఘటనలో రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారని రాయ్‌గఢ్ ఎస్పీ సోమనాథ్ ఘర్గే తెలిపారు. బస్సు పడిన కాలువ లోతు దాదాపు 500 అడుగులు ఉంటుందని తెలుస్తుంది. పల్టీలు కొట్టుకుంటూ బస్సు వెళ్లడంతో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు స్థానికులు పేర్కొంటున్నారు. లోతైన లోయలో బస్సు పడిపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయి.