Dehradun Fire Accident : బాబోయ్.. బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్, నలుగురు సజీవదహనం

Dehradun Fire Accident : ఆ ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.

Dehradun Fire Accident : బాబోయ్.. బాంబులా పేలిన గ్యాస్ సిలిండర్, నలుగురు సజీవదహనం

Dehradun Fire Accident (Photo : Google)

Dehradun Fire Accident : ఉత్తరాఖండ్ రాష్ట్రం డెహ్రాడూన్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో వంట గ్యాస్ సిలిండర్ బాంబులా పేలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు బాలికలు సజీవదహనం అయ్యారు.

డెహ్రాడూన్ జిల్లాలోని చక్రతా సమీపంలోని మారుమూల ప్రాంతం తుని గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఓ కుటుంబం ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. ఆ ఇల్లు మొత్తం చాలావరకు చెక్కతో నిర్మించారు. ఆ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వేగంగా వ్యాపించాయి. పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. వంట గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం జరిగిందని తెలుస్తోంది.(Dehradun Fire Accident)

Also Read..Man Burnt Alive : సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ నాగరాజు సజీవదహనం కేసు.. మృతుడి తమ్ముడు వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణం

మంటలు ఎగసిపడటంతో ఇంట్లోని కుటుంబసభ్యులు అలర్ట్ అయ్యారు. కుటుంబంలోని పెద్ద వారు వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. దీంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. అయితే నలుగురు ఆడపిల్లలు మాత్రం బయటకు రాలేకపోయారు. మంటల్లో చిక్కుకుపోయి సజీవదహనం అయ్యారు. విషయం తెలుసుకున్న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందం రంగంలోకి దిగింది. సహాయక చర్యలు చేపట్టింది. ఇద్దరు బాలికల మృతదేహాలను బయటకు తీసుకొచ్చింది.

Also Read..Maharashtra: హెయిర్ కటింగ్ నచ్చలేదని 16వ అంతస్థు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న బాలుడు

తీవ్రంగా శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై అధికారులు మేజిస్ట్రియల్ విచారణకు ఆదేశించారు. ఇది చాలా పెద్ద అగ్నిప్రమాదం అని అధికారులు చెప్పారు. మంటలు ఆర్పివేసేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా కష్టపడాల్సి వచ్చిందన్నారు. 5గంటలకు పైగా తీవ్రంగా శ్రమించిన సిబ్బంది.. ఎట్టకేలకు మంటలను అదుపులోకి తీసుకురాగలిగారని చెప్పారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారణం వ్యక్తం చేశారు.