Maharashtra: లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలి.. ‘మహా’ ప్రతిపక్ష నేతల డిమాండ్

మహారాష్ట్ర నుంచి అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్న నేపథ్యంలో సీఎం ఏక్‌నాథ్ షిండే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. తన వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Maharashtra: మహారాష్ట్ర నుంచి అనేక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న నేపథ్యంలో బ్రిటన్ మాజీ ప్రధాని లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని సీఎం ఏక్‌నాథ్ షిండే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు
డిమాండ్ చేస్తున్నాయి. బ్రిటన్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టలేకపోయినందుకు ఇటీవలే లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

Chiranjeevi: సమంతకు మెగాస్టార్ ట్వీట్.. ఈ ఛాలెంజ్ నెగ్గుకొస్తావంటూ భరోసా!

మరోవైపు మహారాష్ట్రకు రావాల్సిన అనేక కీలక ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఏక్‌నాథ్ షిండే సీఎం అయిన కొద్ది రోజుల్లోనే మహారాష్ట్రకు రావాల్సిన టాటా-ఎయిర్ బస్ ప్రాజెక్టుతోపాటు, వేదాంత ఫాక్స్‌కాన్ సంస్థ ప్రాజెక్టు, బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టు వంటివి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయి. దీంతో ఈ అంశంపై ఏక్‌నాథ్ షిండే ఆధ్వర్యంలోని బీజేపీ-తిరుగుబాటు శివసేన ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉద్ధవ్ థాక్రే ఆధ్వర్యంలోని శివసేనతోపాటు, ఎన్సీపీ కూడా షిండేపై విమర్శలు చేస్తున్నాయి. లిజ్ ట్రస్‌ను ఆదర్శంగా తీసుకుని, షిండే తన పదవికి రాజీనామా చేయాలని కోరుతున్నాయి. ‘‘షిండే తరచూ ఢిల్లీ వెళ్తారు. కానీ, ఎప్పుడూ మహారాష్ట్ర గురించి మాట్లాడరు. టాటా-ఎయిర్ బస్ ప్రాజెక్టు రాష్ట్రానికి వస్తుందని షిండే ఒక్కసారి కూడా చెప్పలేదు.

Kangana Ranaut: కంగనా బీజేపీలోకి రావొచ్చు.. కానీ షరతులివే: జేపీ నద్దా

మేం ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా ఈ ప్రాజెక్టుల గురించి మాట్లాడేవాళ్లం. ఇప్పుడు ప్రభుత్వం ఈ ప్రాజెక్టుల గురించి
మాట్లాడటం లేదు’’ అని మాజీ మంత్రి ఆదిత్యా థాక్రే విమర్శించారు. మరోవైపు ఏక్‌నాథ్ షిండే తన పదవిని కాపాడుకోవడంలో బిజీగా ఉన్నాడని, ఆ లోపు గుజరాత్ ప్రభుత్వం మహారాష్ట్రపై సర్జికల్ స్ట్రైక్స్ చేస్తోందని
ఎన్సీపీ నేతలు విమర్శించారు. మహారాష్ట్ర నుంచి ప్రాజెక్టులు వెళ్లిపోతుండటంతో షిండే ప్రజలు, ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు