Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త

ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. భార్యకి చికెన్ వండడం రాలేదని ఒకరు.. భార్య స్నానం చేయడం లేదని ఒకరు.. భార్య పుట్టింటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుందని మరొకరు ఇలా..

Husband Suicide: భార్యకు చీర సరిగా కట్టుకొవడం రాదని సూసైడ్ చేసుకున్న భర్త

Boy Suicide Attempt

Updated On : May 17, 2022 / 8:28 PM IST

Husband Suicide: ఇటీవలి కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకే సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. భార్యకి చికెన్ వండడం రాలేదని ఒకరు.. భార్య స్నానం చేయడం లేదని ఒకరు.. భార్య పుట్టింటి వాళ్ళతో ఎక్కువగా మాట్లాడుతుందని మరొకరు ఇలా ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళున్నారు. వాళ్ళ జాబితాలోనే ఇప్పుడు భార్యకు సరిగా చీర కట్టుకోవడం కూడా రాదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. మహారాష్ట్ర ఔరంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది.

boy suicide attempt: చదువుకోమన్నందుకు బాలుడు ఆత్మహత్యా యత్నం

సమాధాన్ సాబ్లే అనే 24 ఏళ్ల యువకుడు తనకన్నా ఆరేళ్లు పెద్దదైన యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు సరిగ్గా మాటలు రావు. అదే విధంగా, చీర కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు.. సరిగా నడవలేదు. ఇవన్ని దాచిపెట్టి తన జీవితం నాశనం చేశారని అతను కుమిలిపోయాడు. ఈ క్రమంలో ఇంట్లో తన గదిలోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భర్త ఎంతసేపటికి గది తలపులు తీయక పోవడంతో భార్య భయపడిపోయి ఇరుగు పోరుగు వారిని పిలిచింది. వారు తలుపు పగలగొట్టి చూడగా అతను దూలానికి వెళాడుతు కన్పించాడు.

Wife Suicide: భర్త సినిమాకు తీసుకెళ్లలేదని..ఆత్మహత్య చేసుకున్న భార్య

తన భార్యకు చీర కట్టుకొవడం రాదని, సరిగా నడవలేదని, సరిగా మాట్లాడలేదని అతను రాసుకొచ్చాడు. ఇలాంటి మహిళతో జీవితం కొనసాగించలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.