Maharashtra: దీపావళికి టపాసులు కాల్చడం అందరికీ సరదానే. అయితే, ఎవరికీ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. కానీ, మహారాష్ట్రలో ఒక వ్యక్తి మాత్రం సరదా కోసం చేసిన పని అపార్టుమెంట్ వాసుల్ని ఇబ్బంది పెట్టింది.
West Bengal: బాల్ అనుకుని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు పేలి బాలుడి మృతి
థానె జిల్లా, ఉల్‌హసన్ నగర్ పట్టణంలో సోమవారం రాత్రి దీపావళి సందర్భంగా ఒక వ్యక్తి రాకెట్లు కాల్చాడు. అయితే.. ఆకాశంలోకి కాదు. నేరుగా అపార్టుమెంట్‌లోకి రాకెట్లు గురిపెట్టాడు. అతడు కాల్చిన రాకెట్లు వరుసగా అపార్టుమెంట్‌లోని ఫ్లాట్లలోకి దూసుకెళ్లాయి. దీంతో వాటిలో నివసించేవాళ్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఆ వ్యక్తి అపార్ట్‌మెంట్ కింది నుంచి, పైన బాల్కనీలోకి రాకెట్లు ప్రయోగిస్తుండగా వేరే వాళ్లు వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Rahul Gandhi: ‘భారత్ జోడో యాత్ర’ సిబ్బంది, సహాయకులకు రాహుల్ కానుకలు.. వెండి నాణేలు, స్వీట్లు బహూకరణ
ఆ వ్యక్తి చేసిన పనిని పలువురు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
Viral | Ulhasnagar police is on the lookout for this unidentified youth, who is spreading terror by firing firecracker rockets targeting flats in buildings. Case u/s 285, 286, 336 of IPC registered following his video going viral on Instagram. pic.twitter.com/MR1y4ahEpw
— MUMBAI NEWS (@Mumbaikhabar9) October 24, 2022