West Bengal: బాల్ అనుకుని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు పేలి బాలుడి మృతి

రైల్వే ట్రాక్ పక్కన ఆడుకుంటుండగా చిన్నారులకు ఒక ప్యాకెట్‌లో కనిపించిందో వస్తువు. గుండ్రంగా ఉండటంతో దాన్ని బాల్ అనుకున్నారు. దానితో ఆడుకోవడం మొదలుపెట్టారు. కాస్సేపట్లో అది పేలిపోయింది.

West Bengal: బాల్ అనుకుని బాంబుతో ఆడుకున్న చిన్నారులు.. ప్రమాదవశాత్తు పేలి బాలుడి మృతి

West Bengal: పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. రైల్వే ట్రాక్ పక్కన దొరికిన బాంబుతో ఆడుకుంటుండగా, అది పేలి ఒక బాలుడు మరణించాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో, కోల్‌కతాకు 30 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం జరిగింది.

WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

కాకినార-జగద్దల్ స్టేషన్ల మధ్య, భాత్పారా దగ్గర రైల్వే ట్రాకు సమీపంలో మంగళవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్నారు. వారికి రైల్వే ట్రాక్ సమీపంలో ఒక ప్యాకెట్ కనిపించింది. అందులో బాల్ లాంటి వస్తువు దొరికింది. అది నిజానికి బాంబ్. కానీ, పిల్లలకు ఆ విషయం తెలియక పోవడంతో దానితో ఆడుకున్నారు. ఈ క్రమంలో ఆ బాంబు ఉన్నట్లుండి పేలిపోయింది. ఈ ఘటనలో ఏడేళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.

వీరికి స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాంబు అక్కడికి ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.