WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

దాదాపు రెండు గంటలపాటు నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా మంగళవారం మధ్యాహ్నం వాట్సాప్ సేవలు నిలిచిన సంగతి తెలిసిందే.

WhatsApp: వాట్సాప్ సేవల పునరుద్ధరణ.. రెండు గంటల తర్వాత తిరిగి ప్రారంభమైన వాట్సాప్ సేవలు

Updated On : October 25, 2022 / 2:58 PM IST

WhatsApp: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ తిరిగి పని చేస్తుందా… లేక కొన్ని దేశాల్లో మాత్రమే పనిచేస్తుందా అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు.

WhatsApp Services Down: నిలిచిపోయిన వాట్సాప్ సేవలు.. మీమ్స్‌తో నెటిజన్ల హల్‌చల్.. మెటా ప్రతినిధులు ఏమన్నారంటే..

మంగళవారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయం నుంచి ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే పరిస్థితి. ఈ విషయంపై ట్విట్టర్ సహా అనేక మాధ్యమాల్లో యూజర్లు ఫిర్యాదు చేశారు. తమ అసహనం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన వాట్సాప్ మాతృసంస్థ ‘మెటా’ సేవలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పింది. దాదాపు రెండు గంటల తర్వాత నుంచి వాట్సాప్ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం రెండున్నర గంటల లోపు సేవలు ప్రారంభమయ్యాయి.

Anand Mahindra-Rishi Sunak : విన్‌స్టన్ చర్చిల్ చేసిన అవహేళనకు 75ఏళ్ల తరువాత బ్రిటీష్ వారికి రిషి సునాక్ ధీటైన సమాధానం

కాగా, ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లోనూ సమస్య తలెత్తినట్లు సమాచారం. ప్రస్తుతానికి సేవలు ప్రారంభమైనప్పటికీ, అన్ని దేశాల్లో సేవలు మొదలయ్యాయో లేదో తెలీదు. అయితే, వాట్సాప్ సేవలు నిలిచిపోవడానికి గల కారణాలను ఆ సంస్థ అన్వేషిస్తోంది.