Monks attacked in Sangli on suspicion of being child-lifters
Maharashtra : మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో నలుగురు సాధువులపై గ్రామస్తులు దారుణంగా దాడికి పాల్పడ్డారు. కర్రలు, బెల్టులతో చితకబాదారు. మాకేమీ తెలియదు ఎందుకు కొడుతున్నారని సాధువులు ఎంతగా బతిమిలాడినా వదల్లేదు. సాధువులను కారులోంచి బయటకు ఈడ్చి మరీ కొట్టారు. కారులో వెళుతున్న సాధువులు వారి వెళ్లాల్సిన దారి తెలియక అటుగా వెళ్లుతున్న ఓ బాలుడ్ని ఆపి దారి అడిగారు. అంతే..సాధువల వేషంలో వచ్చి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాగా భావించిన గ్రామస్తులు నలుగురు సాధువులపై విచక్షణారహితంగా దాడి చేశారు. కర్రలు..బెల్టులతో చితకబాదారు.
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అఖాడా సాధువులు కర్ణాటకలోని జీజాపూర్ వెళ్లి.. అక్కడినుంచి పండరీపురం పుణ్యక్షేత్రానికి కారులో బయలుదేరారు. దారి మధ్యలో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలోని లవంగా గ్రామంవద్దకు చేరుకున్నారు. పండరీపురం ఏదారి గుండా వెళ్లాలో అర్థం కాలేదు. దీంతో సాధువులు కారు ఆపి అటుగా వెళుతున్న ఓ బాలుడ్ని ఆపి ఓ పిల్లవాడిని పండరీపురం ఎలా వెళ్లాలని అడిగారు. అయితే వీరిని అనుమానించిన గ్రామస్థులు సాధువులపై అనుమానం వ్యక్తంచేశారు. మీరు ఎక్కడినుంచి వస్తున్నారు?పిల్లాడిని ఏమని అడుగుతున్నారు? అంటూ ప్రశ్నల వర్షంకురిపించారు. సాధువులు చెప్పే సమాధానం కూడా వినకుండా వారు పిల్లల్ని ఎత్తుకుపోయేవారని అనుమానించి కర్రలు, బెల్టులతో దాడికి దిగారు. విచక్షణా రహితంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సాధువులను స్టేషన్‌కు తరలించారు.
తాము సాధువులేనని..మథురలోని శ్రీ పంచనం జునా అఖాడాకు చెందినవారని పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు సాధువుల వివరాలు తెలుసుకున్నారు. గ్రామస్థులు తప్పుగా అర్ధం చేసుకుని దాడి చేశారని వాపోయారు. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దానిపై విచారణ చేస్తున్నామని..వాస్తవాలు తెలుసుకుని దాడి చేసినవారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. దీంట్లో భాగంగా విచారణ చేపట్టిన పోలీసులు వారు సాధువులేనని తేల్చారు. సాధువులపై దాడి చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు.
Maharashtra: Monks attacked in Sangli on suspicion of being child-lifters, police probe underway
Read @ANI Story | https://t.co/BtNwDXDGHZ#Maharashtra #monks #Sangli #childlifters pic.twitter.com/5Qr1yLJj7n
— ANI Digital (@ani_digital) September 14, 2022