Omicron In Maharashtra : మహారాష్ట్రలో కొత్తగా 8 ఒమిక్రాన్ కేసులు.. ఒక్క ముంబైలోనే..!

మహారాష్ట్రను కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ(డిసెంబర్-14,2021)కొత్తగా రాష్ట్రంలో ఎనిమిది

Mumbai2

Omicron In Maharashtra :  మహారాష్ట్రను కోవిడ్ కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” టెన్షన్ పెడుతోంది. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. ఇవాళ(డిసెంబర్-14,2021)కొత్తగా రాష్ట్రంలో ఎనిమిది ఒమిక్రాన్ కేసులు వెలుగుచూశాయి. అయితే ఇవాళ నమోదైన ఈ ఎనిమిది కేసుల్లో.. ఏడు ముంబైలోనే నమోదుకాగా,మిగిలిన ఒక కేసు పేషెంట్ ముంబైకి దాదాపు 55 కిలోమీటర్ల దూరంలోని వసాయ్-విహార్ కి చెందినవాడని అధికారులు తెలిపారు. వీరందరూ 24-41 ఏళ్ల లోపు వయస్సు కలవారని,ముగ్గురు పేషంట్లకి అసింప్టమాటిక్,మిగిలిన 5గురికి తేలికపాటి సింప్టమ్స్(రోగ లక్షణాలు)ఉన్నట్లు తెలిపారు.

అయితే ఈ రోజు ఒమిక్రాన్ పాజిటివ్ గా తేలిన ఎనిమిది మందికి ఎలాంటి అంతర్జాతీయ ప్రయాణ హిస్టరీ లేదని,అయినా కూడా వీరు ఒమిక్రాన్ బారినపడ్డారని మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ఈ ఎనిమిది మందిలో ఒకరు బెంగళూరు,మిగిలిన వాళ్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారని తెలిపారు.

తాజా కేసులతో కలిపి మహారాష్ట్రలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది. ఈ 28కేసుల్లో…12 ముంబైలో,పూణేలో 2,కళ్యాణ్ దొంబివాళీలో 1,నాగ్ పూర్ లో 1,లతూర్ లో 1,వసాయ్ విహార్ లో 1, పింప్రి చించ్వాడ్ లో 10 నమోదయ్యాయి. ఇందులో 9మంది పేషెంట్లు ఒమిక్రాన్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 19 యాక్టివ్ ఒమిక్రాన్ కేసులున్నాయి. కాగా,ఒమిక్రాన్ కట్టడి కోసం దేశంలో ఆంక్షలు విధించిన మొదటి రాష్ట్రం మహారాష్ట్రనే. అయినప్పటికీ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం,ముఖ్యంగా ఎలాంటి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేనివాళ్లకు ఒమిక్రాన్ సోకుతుండటం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం.

ఇక,దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 57కి పెరిగింది.

ALSO READ Mumbai : ముంబైలో రేపటినుంచి ఆ స్కూళ్లన్నీ రీఓపెన్..