Maharashtra Politics: 30 ఏళ్ల కిందటే మహిళా రిజర్వేషన్లు అమలు చేశారట.. మోదీకి తెలియదేమో అంటున్న శరద్ పవార్

నిన్న దేశ ప్రధాని (నరేంద్ర మోదీ) పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌పై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఇద్దరు సభ్యులు తప్ప ఎవరూ వ్యతిరేకించలేదు

Pawar Attacks Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) చీఫ్ శరద్ పవార్ మంగళవారం ఎదురుదాడికి దిగారు. తాము 30 ఏళ్ల క్రితమే మహిళా రిజర్వేషన్లు అమలు చేశామని, బహుశా ఆ చరిత్ర తెలియకుండా ప్రధాని మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.

‘‘1993లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించాం. దేశంలోనే మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం మహారాష్ట్ర. బహుశా ఈ విషయం ప్రధాని నరేంద్ర మోదీకి తెలియకపోవచ్చు’’ అని పవార్ అన్నారు. అంతకు ముందు రాజస్థాన్‌లోని జైపూర్‌లో సోమవారం జరిగిన ఒక కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘‘నిజానికి మీ (మహిళలు) ఒత్తిడితో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రతిపక్ష పార్టీలు మద్దతిచ్చాయి’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Nara Lokesh : రాష్ట్రపతిని కలిసిన నారా లోకేశ్.. చంద్రబాబు అరెస్ట్‌పై ఫిర్యాదు.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్..

దీనిపై శరద్ పవార్ స్పందిస్తూ.. ‘‘నిన్న దేశ ప్రధాని (నరేంద్ర మోదీ) పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్‌పై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఇద్దరు సభ్యులు తప్ప ఎవరూ వ్యతిరేకించలేదు. రాజ్యాంగ సవరణ సమయంలో ఓబీసీలకు కూడా అవకాశం కల్పించాలన్నది మా డిమాండ్’’ అని అన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 73వ రాజ్యాంగ సవరణ తర్వాత స్థానిక సంస్థల్లో మహిళలకు 33 శాతం కోటా కల్పించామని శరద్ పవార్ చెప్పారు. తాను రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో మహిళలకు 11 శాతం రిజర్వేషన్లు కల్పించినట్లు ఆయన పేర్కొన్నారు.

Syed Shahnawaz Hussain: బీజేపీ నేత సయ్యద్ షానవాజ్ హుస్సేన్ కు గుండెపోటు.. ముంబైలోని ఆసుపత్రిలో చేరిక

ఈ విషయంలో ప్రధాని మోదీకి సరైన సమాచారం ఇవ్వకపోవడం దురదృష్టకరమని అన్నారు. అందుకే ఆయన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని దుయ్యబట్టారు. ఇక కెనడా అంశం గురించి పవార్ మాట్లాడుతూ.. భారత పౌరుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, తాను భారత ప్రభుత్వ విదేశాంగ విధానానికి పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు