Weekend Lockdown: మహారాష్ట్రలో వీకెండ్ లాక్‌డౌన్ మొదలైంది

మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మహా ప్రభుత్వం వారాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధించింది.

Maharashtra Weekend Lockdown Starts Today Amid Covid Surge

Maharashtra weekend lockdown : మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్ ప్రారంభమైంది. రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు పెరిగిపోతున్న క్రమంలో మహా ప్రభుత్వం వారాంతంలో కఠినమైన లాక్ డౌన్ విధించింది. వీకెండ్ లాక్ డౌన్ శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు అమల్లో ఉంటుంది.

అలాగే ప్రతిరోజు రాత్రివేళల్లో నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. నిత్యావసర సర్వీసులకు మాత్రమే అనుమతి ఉంటుంది. సెక్షన్ 144 విధించగా.. ఐదుగురు లేదా ఎక్కువ మంది కనిపించరాదు. ఈ కొత్త ఆంక్షలు ఏప్రిల్ 30 వరకు అమల్లో ఉంటాయి.

– ఏప్రిల్ 30 వరకు అన్ని బీచ్ లు మూసివేస్తారు.
– ఫైనాన్సిషియల్ సర్వీసులు మినహా అన్ని ప్రైవేటు ఆఫీసులు మూసివేత..
– వర్క్ ఫ్రమ్ హోం తప్పనిసరి
– రెస్టారెంట్లలో బార్లలో డైనింగ్ సర్వీసులు రద్దు
– టేక్అవే, హోం డెలివరీ, ఉదయం 7 నుంచి రాత్రి 8 వరకు
– అన్ని షాపులు, మాల్స్ , మార్కెట్లు మూసివేత..
– అత్యావసర సర్వీసుల్లో మెడిసిన్, గ్రాసరీస్, వెజిటేబుల్స్ అమల్లో ఉంటాయి.
– సినిమాలు, థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియమ్స్ మూసివేత
– దేవాలయాల్లో భక్తుల దర్శనాలు కూడా మూసివేత
– బ్యూటీ పార్లర్లు, హెయిర్ సెలూన్లు, బార్బర్ షాపులు మూసివేత