మల్లిఖార్జున ఖర్గే జన్మదిన వేడుకలు.. రాహుల్, ప్రియాంకలు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్ ..

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా జరిగాయి.

Mallikarjun Kharge Birthday Celebration

Mallikarjun Kharge Birthday Celebration: కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే జన్మదిన వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్లమెంటులోని ఖర్గే కార్యాలయంలో ఆయన పుట్టినరోజు కేక్‌ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలువురు ఎంపీలు హాజరయ్యారు. రాహుల్, ప్రియాంకలు ఖర్గేకు కేక్ తినిపించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.