సభలో మాట్లాడుతుండగా ఖర్గేకు అస్వస్థత.. ఆ సమయంలోనూ ఏమన్నారో తెలుసా?

ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

mallikarjun kharge

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వేదికపైనే అస్వస్థతకు గురయ్యారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కథువా జిల్లాలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఖర్గే ప్రసంగిస్తుండగా ఆయన కళ్లుతిరిగాయి. దీంతో ఆయన కింద పడిపోబోతుండగా ఆయనను అక్కడున్న వారు పట్టుకున్నారు.

నీరు తాగిన ఖర్గే మళ్లీ ప్రసంగాన్ని కొనసాగిస్తూ… ప్రధాని మోదీ అధికారం నుంచి దిగిపోయేవరకు తాను చనిపోనని అన్నారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదాను తీసుకొస్తామని చెప్పారు.

దాని కోసం పోరాడుతూనే ఉంటామని అన్నారు. ఖర్గే అస్వస్థతకు గురైన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇప్పటికే జమ్మూకశ్మీర్‌లో రెండు విడతల పోలింగ్‌ ముగిసింది. తదుపరి విడత పోలింగ్‌ సోమవారం జరుగుతుంది. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల వేళ ప్రధాన పార్టీల కీలక నేతలు వరుసగా పర్యటనలు చేస్తున్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి దగ్గర కలకలం..! ఆ వ్యక్తుల ఫోన్‌లో రాజాసింగ్ ఫోటోలు..!