Mallikarjun Kharge: పార్టీని పటిష్టం చేసేందుకే అధ్యక్ష బరిలోకి.. శశిథరూర్ నా చిన్న తమ్ముడులాంటి వాడు..

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్‌ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని మల్లిఖార్జున్ ఖార్గే అన్నారు. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న సోదరుడు లాంటి వాడని, మా అందరి లక్ష్యం పార్టీని బలోపేతం చేయటమేనని ఖర్గే తెలిపారు.

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ఆ పార్టీ సీనియర్ నేత మల్లిఖార్జున్ ఖర్గే ఆదివారం మీడియాతో పలు విషయాలను పంచుకున్నారు. నేను ఎవరినీ ఎదిరించడం కోసం అధ్యక్ష స్థానంకోసం పోటీపడటం లేదని, పార్టీని బలోపేతం చేసేందుకే పార్టీ అత్యున్నత పదవి రేసులోకి దిగానని ఖర్గే అన్నారు. అధ్యక్ష ఎన్నికను ఏకగ్రీవం చేసేలా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? అని విలేకరుల ప్రశ్నించగా.. ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు శశిథరూర్ ను పోటీ నుంచి తప్పుకోవాలని నేను ఏమాత్రం కోరనని అన్నారు. ఏకాభిప్రాయంతో అభ్యర్థిని ఎన్నుకోవడం మంచిదని గతంలో తాను శశిథరూర్ కు సూచించినప్పటికీ.. ప్రజాస్వామ్యంలో పోటీ ఉంటేనే మంచిదని ఖర్గే అన్నారు. శశిథరూర్ కూడా తన చిన్న సోదరుడు లాంటి వాడని, మా అందరి లక్ష్యం పార్టీని బలోపేతం చేయటమేనని ఖర్గే తెలిపారు.

Avalanche Hits Nepal: నేపాల్‌లోని మనస్లు బేస్ క్యాంపు‌పై మరో భారీ హిమపాతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు .. వీడియో వైరల్

బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి పేదల అభివృద్ధికోసం వారిచ్చిన వాగ్దానాలేవీ కూడా నెరవేరలేదని, దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం బాగా పెరిగిందని ఖర్గే అన్నారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ పోటీకి విముఖత వ్యక్తం చేయడంతో సంస్థాగత ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు తనను కోరారని, ఒక వ్యక్తికి ఒకే పదవి అనే పార్టీ తీర్మానానికి కట్టుబడి నామినేషన్ వేసిన రోజే రాజ్యసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా ఇచ్చానని ఖర్గే చెప్పారు.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గేనే సరియైన వ్యక్తి.. శశిథరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గెహ్లాట్

పార్టీని పటిష్టం చేయడమే నా లక్ష్యంగా ఉంటుందని, పార్టీకోసం పనిచేయడం అంటే పార్ట్ టైం ఉద్యోగం కాదని, పూర్తిస్థాయిలో పార్టీకి సమయం కేటాయించాల్సి ఉంటుందని ఖర్గే అన్నారు. కేవలం కాంగ్రెస్ అధ్యక్ష పదవికే తాను పోటీ పడటం లేదని, సిద్ధాంతాలకోసం పార్టీ జరుపుతున్న పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. గాంధీ జయంతి రోజే తన ప్రచారం మొదలుపెట్టినట్టు తెలిపారు.

Bottle hurled at kejriwal: సీఎం కేజ్రీవాల్ వైపుగా వాటర్ బాటిల్ విసిరేసిన వ్యక్తి

ఇదిలాఉంటే.. ఖర్గే తరఫున ప్రచారం చేసేందుకు ముగ్గురు పార్టీ నేతలు అధికార ప్రతినిధులుగా రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ఎన్నికకోసం ప్రచారం చేయడానికి గౌరవ్ వల్లభ్, దీపేందర్ ఎస్ హుడా, సయ్యద్ నసీర్ హుస్సేన్‌లు అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేశారు.

ట్రెండింగ్ వార్తలు