Avalanche Hits Nepal: నేపాల్‌లోని మనస్లు బేస్ క్యాంపు‌పై మరో భారీ హిమపాతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు .. వీడియో వైరల్

నేపాల్‌లోని మనస్లు బేస్‌ క్యాప్‌లో వారం రోజుల వ్యవధిలోనే మరో హిమపాతం సభవించింది. ఆదివారం మౌంట్ మనస్లు బేస్ క్యాంప్ ను హిమపాతం తాకింది. దీంతో బేస్ క్యాంప్‌లో ఏర్పాటు చేసుకున్న కొన్ని టెంట్లు దెబ్బతిన్నాయి.

Avalanche Hits Nepal: నేపాల్‌లోని మనస్లు బేస్ క్యాంపు‌పై మరో భారీ హిమపాతం.. భయంతో పరుగులు పెట్టిన పర్వతారోహకులు .. వీడియో వైరల్

Avalanche Hits Nepal

Avalanche Hits Nepal: నేపాల్‌లోని మనస్లు బేస్‌ క్యాప్‌లో వారం రోజుల వ్యవధిలోనే మరో హిమపాతం సభవించింది. ఆదివారం మౌంట్ మనస్లు బేస్ క్యాంప్ ను హిమపాతం తాకింది. దీంతో బేస్ క్యాంప్‌లో ఏర్పాటు చేసుకున్న కొన్ని టెంట్లు దెబ్బతిన్నాయి. భారీ హిమపాతం దూసుకొస్తుండగా.. దాని భారినుంచి తప్పించుకొనేందుకు స్థానికులు పరుగులు తీయడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Congress President Election: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గేనే సరియైన వ్యక్తి.. శశిథరూర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన గెహ్లాట్

ప్రపంచంలో ఎనిమిదో ఎత్తయిన పర్వతం మనస్లు. ఈ శిఖరాన్ని అధిరోహించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్వతారోహకులు వస్తుంటాయి. అయితే ఈ ఏడాదికిగాను నేపాల్ 400 మందికి అనుమతులు ఇచ్చింది. సెప్టెంబర్ 26న హిమోత్పాతానికి ఇద్దరు మరణించారు, 11 మంది గాయపడ్డారు. ఆదివారం జరిగిన తాజా సంఘటనలో.. బేస్ క్యాంప్‌ను హిమపాతం తాకింది. హిమోత్పాతం వేగంగా వస్తుండటంతో బేస్ క్యాంప్ దగ్గరున్న వారు పరుగులు తీయడం వీడియోలో చూడొచ్చు. తాజా ఘటన తర్వాత సహాయక చర్యలు ముమ్మరం అయ్యాయి. అయితే ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాలేదు.

ప్రపంచంలోనే ఎనిమిదో అత్యంత ఎత్తయిన పర్వతం మనస్లు. ప్రమాదకరమైన పర్వతాల్లో ఐదో స్థానంలో ఉంది. ఇప్పటి వరకు పర్వాతారోహణకు అక్కడకు వెళ్లిన వారిలో 53 మంది మరణించారు.