ఇక్కడ ఉన్నది దీదీ.. ముఖ్యమంత్రి కాదు.. నేను రాత్రంతా నిద్రపోలేదు: మమతా బెనర్జీ
ఈ సమస్యను పరిష్కరించడంలో ఇదే తన చివరి ప్రయత్నమని చెప్పారు.

Mamata Banerjee
‘ఇక్కడ ఉన్నది దీదీ.. ముఖ్యమంత్రి కాదు’ అని కోల్‌కతా డాక్టర్లతో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచారం ఘటనపై ఆందోళన తెలుపుతున్న వైద్యులను ఇవాళ మమతా బెనర్జీ కలిశారు. వైద్యుల నినాదాల మధ్యే మమతా బెనర్జీ మాట్లాడారు. ఈ సమస్యను పరిష్కరించడంలో ఇదే తన చివరి ప్రయత్నమని చెప్పారు.
“దయచేసి 5 నిమిషాలు నేను చెప్పేది వినండి, ఆ తర్వాత నినాదాలు చేయండి.. నినాదాలు చేయడం మీకు ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు. నేను చాలా కాలంగా ఎదురుచూస్తున్నాను. నా భద్రతా అధికారులు ఇచ్చిన సలహాను కూడా కాదని మీ నిరసనలకు సెల్యూట్ చేయడానికి నేను ఇక్కడకు వచ్చాను.
నేను కూడా విద్యార్థుల ఉద్యమాలలో పాల్గొన్నాను. నా పదవి పెద్ద విషయం కాదని నాకు తెలుసు. రాత్రంతా వర్షం పడింది.. నేను కూడా బాధపడుతూ నిద్రపోలేకపోయాను. మీ డిమాండ్లను నేను పరిశీలిస్తాను. నేను సర్కారుని ఒంటరిగా నడపను. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు హోం సెక్రటరీ, డీజీపీతో మాట్లాడతాను. దోషులుగా తేలిన వారిపై చర్యలు తీసుకుంటాం” అని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.
Also Read : ప్రధాని మోదీ నివాసంలోకి కొత్త ఫ్యామిలీ మెంబర్.. ఏం పేరు పెట్టారో తెలుసా..? వీడియో వైరల్