Mamata Banerjee: రైలు ప్రమాదం జరిగితే మమ్మల్ని అంటారా? మరి 2002లో ఆ రైలు సంగతేంటీ?: మమత ఆగ్రహం 

కనీసం క్షమాపణ అయినా చెబితే బాగుండేది అని మమతా బెనర్జీ అన్నారు.

Mamata Banerjee – Odisha Train Accident: ఒడిశాలోని బాలాసోర్ లో శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంపై బీజేపీ(BJP)పై విమర్శలు వస్తున్న వేళ ఆ పార్టీ వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. గతంలో పశ్చిమ బెంగాల్ (West bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖ మంత్రులుగా ఉన్న సమయంలో జరిగిన రైలు ప్రమాదాలను బీజేపీ గుర్తు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె 2002లో గోద్రాలో రైలు ఘటన ప్రస్తావించడం గమనార్హం.

” బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం చరిత్రను కూడా మార్చేయగలదు.. నంబర్లను మార్చేయగలదు. ప్రజలకు సాయం చేయడం మానేసి, నన్ను, నితీశ్ జీని, లాలూజీని తిడుతోంది. గోద్రాలో ప్రయాణికులతో వెళ్తున్న రైలుకు ఎలా నిప్పంటుకుంది? చాలా మంది మృతి చెందారు. వారు కనీసం క్షమాపణ అయినా చెబితే బాగుండేది” అని అన్నారు.

కాగా, రైలు ప్రమాదంపై ఆర్జేడీ నేత, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ స్పందిస్తూ… ప్రయాణికుల రక్షణకే తమ మొదటి ప్రాధాన్యం అని రైల్వే చెప్పుకుంటుందని అన్నారు. మరోవైపు, ఇంత పెద్ద ప్రమాదం జరిగినప్పటికీ దానికి బాధ్యులు ఎవరో తేల్చలేకపోతోందని విమర్శించారు.

CBI Probe: ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ.. స్పష్టం చేసిన కేంద్ర రైల్వే మంత్రి

ట్రెండింగ్ వార్తలు