నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో మమతపై దాడి..గాయంతో విలవిలలాడిన దీదీ

నందిగ్రామ్ ఎన్నికల ప్రచారంలో మమతపై దాడి..గాయంతో విలవిలలాడిన దీదీ

Updated On : March 10, 2021 / 7:18 PM IST

west bengal బుధవారం నందిగ్రామ్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీకి గాయాలయ్యాయి. సాయంత్రం ప్రచారం ముగించుకొని ఆమె కారు ఎక్కేందుకు వెళ్తున్న సమయంలో తోపులాట చోటుచేసుకుంది. దీంతో మమత కాలికి గాయం అయింది. నొప్పితో విలవిలలాడారు మమత.

తనపై దాడి జరిగినట్లు మమతా బెనర్జీ తెలిపారు. నలుగురు వ్యక్తులు తనపై దాడికి పాల్పడ్డారని అన్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ రాత్రికి నందిగ్రామ్ లో నే బస చేయాల్సిఉన్నప్పటికీ..కాలి గాయం కారణంగా నందిగ్రామ్ పర్యటన రద్దు చేసుకొని మమత కోల్ కతా వెళ్లిపోయారు. మమతపై దాడి అంశాన్ని ఎన్నికల సంఘానికి టీఎంసీ ఫిర్యాదు చేయనుంది.

కాగా, నందిగ్రామ్ నుంచి టీఎంసీ అభ్యర్థిగా ఇవాళ ఉదయం మమతాబెనర్జీ నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీకి మార్చి-27 నుంచి ఏప్రిల్-29వరకు ఎనిమిది దశల్లో బెంగాల్ ఎన్నికలు జరగనున్నాయి. మే-2న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.