Delhi : మమత ఢిల్లీ టూర్..రాజకీయవర్గాల్లో ఆసక్తి

పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. దీదీకి హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్‌లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థమవుతోంది.

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ చూపు హస్తిన రాజకీయాల వైపు మళ్లింది. దీదీకి హస్తిన పాలిటిక్స్ కొత్త కాకపోయినా.. బెంగాల్‌లో గెలిచిన తర్వాత.. ఆమె వేస్తున్న అడుగు ఢిల్లీ పీఠం వైపే అన్నది స్పష్టంగా అర్థమవుతోంది. ఇందులో భాగంగా మమత ఢిల్లీ టూర్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. సోమవారం నుంచి ఢిల్లీలో మమతా బెనర్జీ పర్యటించనున్నారు. ఐదు రోజుల పాటు ఢిల్లీలో దీదీ పర్యటించనున్నట్లు తెలుస్తోంది. హస్తిన టూర్‌లో భాగంగా.. బుధవారం ప్రధానమంత్రి మోదీని కలవనున్నారు దీదీ. కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా, రాహుల్‌ను కూడా కలుస్తారంటున్నాయి టీఎంసీ వర్గాలు. అయితే దీనిపై ఇప్పటివరకు క్లారిటీ లేదని తెలుస్తోంది.

Read More : YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఐజీ స్థాయి అధికారి

బెంగాల్‌లో బీజేపీని ఢీకొట్టిన మమత.. ఆ తర్వాత ఢిల్లీ పీఠంపై కన్నేసినట్లు తెలుస్తోంది. 2024 పార్లమెంట్ ఎన్నికలే టార్గెట్‌గా మమత వ్యూహాలు రచిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టే పనిలో ఉన్నారామె. జాతీయ రాజకీయాల్లో ప్రత్యక్ష పాత్ర పోషించేందుకు సిద్ధమైన మమత.. తృణమూల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌గా కూడా అయ్యారు. టీఎంసీ చీఫ్ మమత బెనర్జీ ఏకగ్రీవంగా ఈ పదవికి ఎన్నికవగా.. రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.

Read More :Kargil Vijay Diwas : వీరులారా వందనం..ఏం జరిగిందో తెలుసా

ఇప్పటివరకు సొంత రాష్ట్ర వ్యవహారాలకే అత్యధిక సమయం కేటాయించిన మమత.. దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు సిద్ధమవుతున్నారు. మమతా బెనర్జీ ఏడు సార్లు పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నారు. వరుసగా మూడు సార్లు బెంగాల్‌ ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రాష్ట్ర అసెంబ్లీతో పాటు పార్లమెంటులోనూ వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు ప్రకటించింది టీఎంసీ.

ట్రెండింగ్ వార్తలు