YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఐజీ స్థాయి అధికారి

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరికొందరినీ ప్రశ్నించేందుకు గానూ.. ఐజీ స్థాయి అధికారి రంగంలోకి రానున్నారు.

YS Viveka Murder Case: వివేకా హత్య కేసు విచారణలో సీబీఐ ఐజీ స్థాయి అధికారి

Viveka

YS Viveka Murder Case: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరికొందరినీ ప్రశ్నించేందుకు గానూ.. ఐజీ స్థాయి అధికారి రంగంలోకి రానున్నారు. విచారణను మరింత వేగవంతం చేసే ప్రక్రియలో భాగంగా కొత్తగా సీబీఐ విభాగంలోని ఐజీ స్థాయి అధికారి రామ్ కుమార్ కడపకు చేరుకోనున్నారు.

కొద్ది రోజుల క్రితం వరకూ.. డీఐజీ సుధాసింగ్ 49రోజులపాటుగా కేసులోని అనుమానితులను విచారించారు. కీలక నిందితుడైన వాచ్​మెన్​ రంగయ్య నుంచి రెండ్రోజుల కిందట కోర్టులో సీఆర్పీ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. అంతకంటే ఒకరోజు ముందే సీబీఐ డీఐజీ సుధాసింగ్​ను తిరిగి విజయవాడకు పంపించారు. ఆమె స్థానంలోనే తాజాగా రామ్​ కుమార్​ను నియమించారు.

విచారణలో ఎర్ర గంగిరెడ్డి
వివేకానంద రెడ్డి హత్య జరిగిన రోజు ఎర్ర గంగిరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి 11గంటల 20నిమిషాలకి ఇంటికి వచ్చానని చెప్పారు. ఉదయం ఏడు గంటలకు వివేకానంద రెడ్డి అల్లుడు ఫోన్ చేసి చెప్తేగాని, తనకు విషయం తెలియలేదని అన్నారు. వివేకానంద రెడ్డిని హత్య చేసినవారు కానీ, చేయించినవారు గానీ నాకు తెలియదని, తనకు నార్కో అనాలసిస్ పరీక్షలు సైతం నిర్వహించినట్లు ఎర్ర గంగిరెడ్డి వెల్లడించారు.