Kargil Vijay Diwas : వీరులారా వందనం..ఏం జరిగిందో తెలుసా

కార్గిల్‌ యుద్ధంలో పాక్‌పై భారత్‌ విజయాన్ని పురస్కరించుకుని యావత్ భారతావని సోమవారం విజయ దివస్‌ జరుపుకోనుంది. 1999లో కార్గిల్‌లో పాక్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి చిహ్నంగా ఏటా జూలై 26న విజయ దివస్‌ను నిర్వహిస్తున్నారు.

Kargil Vijay Diwas : వీరులారా వందనం..ఏం జరిగిందో తెలుసా

Kargil

India’s Great Victory Over Pakistan : కార్గిల్‌ యుద్ధంలో పాక్‌పై భారత్‌ విజయాన్ని పురస్కరించుకుని యావత్ భారతావని సోమవారం విజయ దివస్‌ జరుపుకోనుంది. 1999లో కార్గిల్‌లో పాక్‌పై జరిగిన యుద్ధంలో విజయానికి చిహ్నంగా ఏటా జూలై 26న విజయ దివస్‌ను నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఇండియాగేట్ వద్ద జరగనున్న వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అమరులకు నివాళులు అర్పిస్తారు. కార్గిల్‌ యుద్ధంలో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుని పలు నగరాలు, పట్టణాల్లో క్యాండిల్స్‌ వెలిగించి నివాళులు అర్పించనున్నారు. దేశం కోసం సర్వస్వాన్ని అర్పించిన జవాన్లకు నివాళులు అర్పించాలని ప్రధాని మోదీ ..ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read More : Tokyo Olympics 2020 : ఫెన్సింగ్: భవానీ దేవి పరాజయం

1999 మే 2న ఉగ్రవాదులతో చేతులు కలిపిన పాక్‌ ఆర్మీ.. నియంత్రణ రేఖను దాటి భారత్‌ భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. ఆయుధాలతో నక్కిన వ్యక్తులను గుర్తించాడు గొర్రెలు మేపేందుకు వెళ్లిన ఓ వ్యక్తి. ఈ సమాచారం ఇవ్వడంతో.. కార్గిల్‌ పర్వత ప్రాంతానికి వెళ్లారు భారత జవాన్లు. పాక్ దళాలు, టెర్రరిస్టులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు. కార్గిల్ ఆయుధగారం ధ్వంసమైంది. ఇండియన్‌ ఆర్మీ తేరుకునేలోపే ద్రాస్‌, కక్సర్‌, ముస్తో సెక్టార్లలో పాక్‌ ఆర్మీ వరుస కాల్పులకు తెగబడింది.

Read More : తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్

బాంబుల వర్షం కురిపించింది. 1999 మే 26న ఎయిర్‌ఫోర్స్‌ను రంగంలోగి దించడంతో శత్రుసేన దాడులను ఎదుర్కొంటూ.. ముందుకెళ్లాయి ఆర్మీ బలగాలు. జూన్ 5న ముగ్గురు పాక్‌ సైనికులు భారత భద్రతాదళాలకు చిక్కడంతో.. దాయాది దేశం పూర్తిస్థాయి యుద్ధానికి తెగబడింది. పాక్‌ ఆర్మీ, టెర్రరిస్టులను భారత్‌ భూభాగం నుంచి తరిమికొట్టేందుకు ఆపరేషన్‌ విజయ్‌ను చేపట్టింది ఇండియన్‌ ఆర్మీ. 1999 జులై 4న కీలకమైన టైగర్‌హిల్స్‌ను భారత్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఆ తర్వాత వరుసగా ఆక్రమిత స్థలాల నుంచి పాక్‌ సేనలు, ఉగ్రవాదులను తరిమికొట్టాయి. జూలై 14 నాటికే శత్రుమూకలను దాదాపు తరిమికొట్టాయి. పాక్‌తో చర్చల అనంతరం జులై 26 అధికారికంగా యుద్ధం ముగిసినట్లు ప్రకటన వెలువడింది. రెండు నెలల పాటు కొనసాగిన యుద్ధంలో 527 మంది భారత జవాన్లు అమరులయ్యారు.