Tokyo Olympics 2020 : ఫెన్సింగ్: భవానీ దేవి పరాజయం

ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము)లో రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పరాజయం పాలై ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది.

Tokyo Olympics 2020 : ఫెన్సింగ్: భవానీ దేవి పరాజయం

Tokyo Games Bhavani Devi Knocked Out

Tokyo Olympics 2020 Live: ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన చెన్నైకి చెందిన భవానీ దేవి ఫెన్సింగ్(కత్తిసాము)లో రౌండ్ 32 మ్యాచ్‌లో 15-7 తేడాతో ఓడిపోయింది. ప్రపంచ నంబర్ 3 మనోన్ బ్రూనెట్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో పరాజయం పాలై ఫైనల్ చేరకుండానే వెనుదిరిగింది. ఒలింపిక్స్ స్థాయిలో ఫెన్సింగ్‌లో భారత్ తరపున ఆడిన భవానీ.. తొలిపోరులో అద్భుత విజయంతో ఆకట్టుకుంది.

తునీషియా క్రీడాకారిణి నదియా బెన్ అజీజీతో జరిగిన పోరులో 15-3 తేడాతో గెలిచింది. కేవలం 6 నిమిషాల 14 సెకండ్లలోనే తొలిరౌండ్ ముగించింది. తద్వారా భవానీ దేవీ రెండో రౌండ్‌కు అర్హత సాధించింది. అంతేకాదు.. భారత్ నుంచి ఫెన్సింగ్‌ లో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన మొదటి క్రీడాకారిణిగా పేరుగాంచింది. రెండో మ్యాచ్ ప్రపంచ ర్యాకింగ్స్‌లో ఫ్రెంచ్ క్రీడాకారిణి బ్రూనెట్‌ (4వస్థానం)తో తలపడి 15-7తేడాతో పరాజయం పాలైంది. భారత్ నుంచి 4వ రోజు ఒలింపిక్స్‌లో ప్రారంభమైన భవానీ పోరు ముగిసింది.

టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్
మరోవైపు టేబుల్ టెన్నిస్ లో అచంత్ శరత్ కమల్ 4-2తో పోర్చుగల్‌కు చెందిన టియాగోను ఓడించి మూడో రౌండ్‌కు చేరుకున్నాడు. ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో శరత్ 2-11, 11-8, 11-5, 9-11, 11-6, 11-9 తేడాతో గెలుపు సాధించాడు.

ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్‌‌కు:
ఒలింపిక్స్ లో భారత ఆర్చరీ పురుషుల జట్టు క్వార్టర్ ఫైనల్‌ కు చేరుకుంది. చివరి రౌండ్‌లో కజకిస్తాన్ 54/60 స్కోరు సాధించింది. దాస్ 9 పాయింట్లు సాధించి జట్టుకు 6-2 విజయాన్ని అందించాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో చేరిన భారత ఆర్చరీ టీం.. కొరియాతో తలపడనుంది.