మండిపోతున్న ఎండల్లో రాజకీయ నాయకులు మాత్రం ప్రచారంలో ఉదృతంగా తిరుగుతున్నారు. ఎండలు మండిపోతున్నా కూడా నాయకులు ఎలాగైనా తీరికలేకుండా రోడ్ల వెంబడి తిరుగుతున్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల వేళ ఓ ఎంపీ అభ్యర్ధి చేస్తున్న వింతమప్రచారం నెట్టింట్లో వైరల్ అవుతుంది. అసలు విషయం ఏమిటంటే… పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ మేనల్లుడు, అభిషేక్ బెనర్జీ డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఎంపీ అభ్యర్ధిగా నిలబడ్డాడు. కేంద్రప్రభుత్వంపై ఒంటి కాలు మీద లేస్తున్న మమతా బెనర్జీ రాష్ట్రం మొత్తం విస్త్రృతంగా తిరుగుతున్నారు.
అయితే ఆమె మేనల్లుడు మాత్రం ఎన్నికల ప్రచారంలో ఎండలో తిరగలేక నమస్కసరిస్తున్న భంగిమలో తన బొమ్మను తయారు చేయించి, ఓ టాప్ లేని జీపులో తిప్పేస్తున్నాడు. తన విగ్రహాన్ని నియోజకవర్గంలో తిప్పుతూ హడావుడి చేస్తుండగా.. అక్కడి స్థానికులు మాత్రం ఇదెక్కడ చ్యోద్యం అంటూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ప్రతిపక్ష నేతలు కూడా ఇవి దిగజారుడు పని అని, ఎండల్లో కొన్ని రోజులు తిరగలేని వ్యక్తులు సామాన్య ప్రజలకు ఏం ఉపయోగపడుతారంటూ విమర్శలు చేస్తున్నారు. మరొకొందరు మాత్రం ఆరోగ్యం కోసం తీసుకుంటున్న జాగ్రత్త అని, అందులో తప్పేం ఉందంటూ సపోర్ట్‌గా మాట్లాడుతున్నారు.
To avoid scorching heat, TMC Diamond Harbour Candidate & Mamata’s Nephew Abhishek Banerjee found an innovative solution
– Using his own statute for Campaigning ?? pic.twitter.com/ZaRAG55gcZ— ? Rishi Bagree ?? (@rishibagree) April 26, 2019