కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. పీజీ, ఎంబీబీఎస్ సీట్లు పెంపు.. ఎన్నంటే

ఈ నిర్ణయంతో నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమమైంది.

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. పీజీ, ఎంబీబీఎస్ సీట్లు పెంపు.. ఎన్నంటే

Updated On : September 24, 2025 / 5:42 PM IST

Medical Education: కేంద్ర క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో మెడికల్ విద్య విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అండర్‌ గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల పెంచుతూ నిర్ణయం తీసుకుంది. CSS పథకం-3 కింద 5వేల కొత్త PG సీట్లు.. 5,023 అదనపు MBBS సీట్ల మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు ఖర్చు పరిమితి పెంచింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల ఆధునికీకరణకు సాయం చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. నూతన స్పెషాలిటీ డాక్టర్ల ప్రవేశానికి మార్గం సుగమం చేస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో దేశంలో స్పెషాలిటీ డాక్టర్ల సంఖ్య పెరగనుంది.

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. వైద్య కళాశాలలు, స్వతంత్ర పీజీ సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం, అప్‌గ్రేడ్ చేయడం కోసం కేంద్ర ప్రాయోజిత పథకం (CSS)-II దశకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా 5వేల పీజీ సీట్లు.. 5,023 MBBS సీట్లను పెంచడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వ వైద్య కళాశాలల అప్‌గ్రేడ్ కోసం CSS విస్తరణకు ఆమోదం తెలిపింది. ఒక్కో సీటుకు రూ. 1.50 కోట్ల ఖర్చు పరిమితిని పెంచారు. ఈ చొరవ అండర్ గ్రాడ్యుయేట్ వైద్య సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది. అదనపు పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను సృష్టించడం ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల సంఖ్య పెరగనుంది. ఈ నిర్ణయం దేశంలోని మొత్తం వైద్యుల లభ్యతను బలోపేతం చేస్తుంది.

2025-26 నుండి 2028-29 వరకు ఈ రెండు పథకాల కోసం రూ.15,034.50 కోట్లు చేయనున్నారు. ఇందులో కేంద్ర వాటా రూ.10,303.20 కోట్లు, రాష్ట్ర వాటా రూ.4731.30 కోట్లు.

రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, సంస్థలలో వైద్య సీట్ల పెంపునకు సంబంధించిన పథకాలు దేశంలో వైద్యులు, నిపుణుల లభ్యతను పెంచడంలో సహాయపడతాయి. తద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ అందుతుంది.

ఈ పథకాల నుంచి కలిగే ఫలితాలు..

* దేశంలో వైద్య విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు మరిన్ని అవకాశాలను కల్పించడం.
* ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా వైద్య విద్య, శిక్షణ నాణ్యతను పెంచడం.
* వైద్యులు, నిపుణుల లభ్యత పెరుగుతుంది.
* ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణలో అంతరాన్ని తగ్గించడం.
* వైద్యులు, అధ్యాపకులు, పారామెడికల్ సిబ్బంది, పరిశోధకులు, నిర్వాహకులు, సహాయక సేవల పరంగా ప్రత్యక్ష, రోక్ష ఉపాధి అవకాశాలను సృష్టించడం.
* ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం. సామాజిక-ఆర్థిక అభివృద్ధికి దోహదపడటం.
* రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలను పెంచడం.

Also Read: వామ్మో.. తులం బంగారం ధర రూ.2లక్షలకు చేరుతుందా..? ఈ ఏడాది చివరిలో ధరలు ఎలా ఉండబోతున్నాయి.. నిపుణులు ఏం చెప్పారంటే..