తండ్రి అంత్యక్రియలు చేసి.. అదే బట్టలతో ఓటు వేశారు

  • Publish Date - May 6, 2019 / 06:30 AM IST

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు 5వ విడత జరుగుతున్నాయి. ఓటర్లు క్యూలలో నిలబడి ఒట్లేస్తున్నారు. ఏడు రాష్ట్రాల్లోని 51 స్ధానాల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. బిహార్‌, జమ్ము కశ్మీర్‌, యూపీ, మధ్యప్రదేశ్‌, రాజస్తాన్‌, పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో పోలింగ్ సాగుతుంది.

సోమవారం(6 మే 2019) ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓపికగా ఓట్లు వేస్తున్న ఓటర్లు ఎండను సైతం లెక్కచేయట్లేదు. అయితే ఓటింగ్‌కు రానీ వ్యక్తులు కళ్లు తెరుచుకనేలా ఓ యువకుడు చేసిన పని ఇప్పడు చర్చకు దారితీసింది.

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్‌లో ఓ వ్యక్తి తన తండ్రి అంత్యక్రియలు చేసి అదే బట్టల మీద హఓట్ వేసేందుకు వచ్చాడు. ఓ వైపు తండ్రి మరణం బాధపెడుతున్నా కూడా ప్రజాస్వామ్యంలో తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన అతనిని ప్రశంసిస్తున్నారు.

ఇదిలా ఉంటే మరోవైపు జార్ఖండ్‌లోని హజారిబాగ్‌లో ఓ వ్యక్తి తన 105 సంవత్సరాల తల్లిని ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రానికి బుజాలపై ఎత్తుకుని తీసుకుని వచ్చారు. ఆమె ఉత్సాహంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.