Vande Bharat (Photo: Google)
Vande Bharat : రాజస్తాన్ లో ఘోరం జరిగింది. వందేభారత్ సెమీ హై స్పీడ్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ కారణంగా ఓ నిండుప్రాణం పోయింది. అసలేం జరిగిందంటే.. పట్టాలపై వేగంగా దూసుకొచ్చిన వందేభారత్ రైలు.. అదే సమయంలో పట్టాలపైకి వచ్చి ఓ ఆవుని బలంగా గుద్దింది. దాంతో ఆ ఆవు గాల్లోకి లేచింది. అదే సమయంలో పట్టాల పక్కనే మూత్ర విసర్జన చేస్తున్న రైల్వే రిటైర్డ్ ఉద్యోగి పై ఆవు పడింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి స్పాట్ లోనే చనిపోయాడు.
అల్వార్ లో దారుణం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ ఆవు సడెన్ గా పట్టాల పైకి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో వందేభారత్ రైలు వేగంగా దూసుకొస్తోంది. ఆవు ట్రైన్ కి ఎదురుగా వెళ్లింది. దాంతో ఆవుని ట్రైన్ బలంగా ఢీకొట్టింది. ఆవు అమాంతం గాల్లోకి లేచింది. పట్టాల పక్కనే మూత్ర విసర్జన చేస్తున్న వ్యక్తి పై పడింది. దాంతో అతడు మరణించాడు. మృతుడిని శివదయాళ్ శర్మగా గుర్తించారు. అతడు రైల్వేలో ఎలక్ట్రీషియన్ గా పని చేసి రిటైర్ అయ్యాడు. బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కాళీ మోరీ గేట్ నుంచి ట్రైన్ వెళ్తున్న సమయంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Also Read..Prabhas Pawan Kalyan : అత్తిలిలో దారుణం.. ప్రభాస్ అభిమాని చేతిలో పవన్ కల్యాణ్ అభిమాని హతం
కాగా, వందేభారత్ రైళ్లు పశువులను ఢీకొట్టడం కొత్తేమీ కాదు. అనేకసార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి. పశువులు సడెన్ గా పట్టాల మీదకు వచ్చేస్తున్నాయి. అసలే వందేభారత్ రైళ్లు హైస్పీడ్ తో వెళ్తుంటాయి. ఆ సమయంలో పశువులను ఢీకొడుతున్నాయి. వందేభారత్ రైళ్లు గంటకు 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఆ సమయంలో పట్టాలపైకి పశువులు వస్తే.. వాటిని కాపాడటం అసాధ్యం. అస్సలు చాన్స్ లేదు.
Also Read..Delta Airlines : విమానంలో రెచ్చిపోయిన వృద్ధుడు, మగాడిని కూడా వదల్లేదు