రూ.25లక్షల పైమాటే : ఇంటి తవ్వకాల్లో దొరికిన బంగారం 

ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపాడు. ఆ తవ్వకాల్లో ఒక్కసారిగా విలువైన బంగారం బయపడింది. బంగారం విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

  • Publish Date - September 7, 2019 / 12:35 PM IST

ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపాడు. ఆ తవ్వకాల్లో ఒక్కసారిగా విలువైన బంగారం బయపడింది. బంగారం విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

ఓ వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరిపాడు. ఆ తవ్వకాల్లో ఒక్కసారిగా విలువైన బంగారం బయపడింది. బంగారం విలువ సుమారు 25 లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఇంటి తవ్వకాల్లో దొరికిన బంగారాన్ని సదరు వ్యక్తి దక్కించుకోలేడని అంటున్నారు పోలీసులు. 650గ్రాములు బంగారంతో పాటు 4.53 కిలోల వెండి అభరణాలు దొరికినట్టు చెప్పారు.

వంద ఏళ్ల నాటి అభరణాలుగా పురాతనకాలం నాటివిగా కనిపిస్తున్నట్టు ఎస్పీ అలోక్ ప్రియదర్శి తెలిపారు. ఇంటి వ్యక్తి దగ్గర దొరికిన అభరణాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వాటిని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఓ వ్యక్తి తన ఇంట్లో తవ్వకాలు జరుపుతుండగా.. లక్షల విలువైన బంగారం దొరికినట్టు గ్రామస్థుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సదరు వ్యక్తి ఇంటికి వెళ్లి ఆరా తీశారు.

అయితే అతడు తనకు ఎలాంటి బంగారం దొరకలేదని బుకాయించాడు. పోలీసులు గట్టిగా మందలించడంతో దొరికిన బంగారాన్ని చూపించాడు. ఎలాంటి బంగారం, వెండి అభరణాలు, ఏదైన ఖరీదైన వస్తువులు భూమిలో దొరికితే అట్టి వస్తువులన్నీ భారత ట్రజరీ ట్రోవ్ యాక్ట్ 1878 ప్రకారం.. ప్రభుత్వ ఖజానా కిందకు వస్తాయి. సెక్షన్ 4 యాక్ట్ కింద ట్రజరీని వెంటనే సంబంధిత జిల్లా రెవిన్యూ అధికారికి సొంతంగా లేదా నోటిస్ ద్వారా తెలియజేయాల్సి ఉంటుంది.

దొరికిన విలువైన వస్తువులను జిల్లా రెవిన్యూ అధికారులతో లేదా సంబంధిత అధికారుల ఎదుట డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 11 యాక్ట్ ప్రకారం.. ఖజానా లభించిన వ్యక్తికి ఆ మొత్తాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. అధికారుల విచారణలో ఆయా వస్తువులు ఎవరికి సంబంధించినవి కావని తేలితే అప్పుడు అధికారులు కనిపెట్టిన వ్యక్తికి ఇచ్చే అవకాశం ఉంది.