షాకింగ్.. లక్షలు కొట్టేశారు : దొంగల బైక్.. ఈడ్చుకెళ్తున్నా బ్యాగు వదల్లేదు

బ్యాంకులో లక్షల నగదు డ్రా చేశాడో యువకుడు. 2.5 లక్షల నగదును బ్లాక్ బ్యాగులో పెట్టుకుని మెల్లగా బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. కానీ, అక్కడే మాటు వేసిన ఇద్దరు దొంగలు అతన్ని మెల్లగా వెంబడించారు.

  • Publish Date - April 23, 2019 / 02:16 PM IST

బ్యాంకులో లక్షల నగదు డ్రా చేశాడో యువకుడు. 2.5 లక్షల నగదును బ్లాక్ బ్యాగులో పెట్టుకుని మెల్లగా బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. కానీ, అక్కడే మాటు వేసిన ఇద్దరు దొంగలు అతన్ని మెల్లగా వెంబడించారు.

బ్యాంకులో లక్షల నగదు డ్రా చేశాడో యువకుడు. 2.5 లక్షల నగదును బ్లాక్ బ్యాగులో పెట్టుకుని మెల్లగా బయటకు వచ్చాడు. అటు ఇటు చూశాడు. కానీ, అక్కడే మాటు వేసిన ఇద్దరు దొంగలు అతన్ని మెల్లగా వెంబడించారు. డబ్బుల బ్యాగుతో వెళ్తున్న యువకుడిని అడ్రస్ అడుగుతున్నట్టు మాటల్లో పెట్టారు.

ఇంతలో వెనుక నుంచి ఇద్దరు దొంగలు బైక్ పై దూసుకొచ్చారు. యువకుడి చేతిలో బ్యాగును కొట్టేశారు. అయినప్పటికీ అతడు ఆ బ్యాగును వదల్లేదు. దాదాపు కిలోమీటరు వరకు బైక్ వెనుక వేలాడుతూ బ్యాగును అలానే పట్టుకున్నాడు. 
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా

దొంగలు బైక్ పై మరింత స్పీడ్ గా దూసుకెళ్తూ అతడ్ని ఈడ్చుకోని వెళ్లారు. ఈ ఘటన బీహార్ లోని హజిపూర్ ప్రాంతంలో మంగళవారం (ఏప్రిల్ 23, 2019) జరిగింది. దీనికి సంబంధించి వీడియో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో దొంగల బైక్ వెనుక బ్యాగు పట్టుకుని యువకుడు వేలాడుతుండగా.. ఈడ్చుకెళ్లడం చూడవచ్చు. 

బీహార్ లో ఇలాంటి ఘటన జరగడం తొలిసారి కాదు. గతంలో ఇక్కడ ఎన్నో చోరీ ఘటనలు వెలుగుచూశాయి. ఏప్రిల్ 2న ఈస్ట్ చాంపరన్ జిల్లాలో ఓ వ్యక్తి నుంచి దొంగలు రూ. 3 లక్షలు దోచుకెళ్లారు. వైరల్ అవుతున్న వీడియో ఇదే..

Also Read : సీసీ కెమెరాల్లో సూసైడ్ బాంబర్ : ఆత్మాహుతికి ముందు పిల్లలతో ముచ్చట్లు