Man attack Lady lawyer: ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదు: మహిళా న్యాయవాదిని కాలితో తన్నిన కర్కశడు

మహిళా న్యాయవాదిని ఒక వ్యక్తి పదే పదే కాలితో తన్నిన ఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌లో చోటుచేసుకుంది.

Bagalkote

Man attack Lady lawyer: మహిళపై దాడులకు పాల్పడుతున్న కొందరు దుర్మార్గులు తామూ ఒక మహిళకే పుట్టామన్న సంగతి మరచి, మానవత్వానికే మచ్చ తెస్తున్నారు. సాటి మహిళలో తల్లిని, సోదరిని చూడాల్సిన కొందరు వ్యక్తులు, కర్కశత్వంతో వ్యవహరిస్తూ మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. మహిళా న్యాయవాదిని ఒక వ్యక్తి పదే పదే కాలితో తన్నిన ఘటన కర్ణాటక రాష్ట్రం బాగల్‌కోట్‌లో చోటుచేసుకుంది. స్థానిక మీడియా కధనం మేరకు..బాగల్‌కోట్‌కు చెందిన మహంతేశ్ చొల్చగుడ్డ అనే వ్యక్తికి అదే పట్టణానికి చెందిన మహిళా న్యాయవాది, సంగీతా సిక్కేరికి మధ్య స్వల్ప వాదన చోటుచేసుకుంది. ఈక్రమంలో సంగీతా పై మహంతేశ్ దాడికి పాల్పడ్డాడు.

Other Stories:Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ

పట్టపగలు, అందరూ చూస్తుండగానే మహంతేశ్ మహిళా న్యాయవాది సంగీతాను కాలితో పదే పదే పొట్టపై తన్నాడు. మహంతేశ్ విచక్షణ రహితంగా దాడి చేస్తుండగా..పక్కనే ఉన్న సంగీతా భర్త అడ్డుకోబోయాడు. దీంతో మహంతేశ్ అతనిపైనా దాడి చేశాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న సంగీతా భర్త.. ఎవరైనా కాపాడండి అంటూ స్థానికులను వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. మహంతేశ్ మహిళా న్యాయవాదిపై దాడి చేస్తున్న దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అవి వైరల్ అయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడ్డ సంగీతా సిక్కేరి, ఆమె భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఘటనపై శనివారం ఆలస్యంగా స్పందించిన బాగల్‌కోట్ పోలీసులు, వీడియో ఆధారంగా మహంతేశ్ పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. స్థానిక రాజకీయ నేత అండతోనే మహంతేశ్ తమపై దాడికి పాల్పడినట్లు బాధితురాలు పోలీస్ ఫిర్యాదులో పేర్కొంది. ఇక ఈఘటన తాలూకు దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి వాడిని ఏం చేసినా తప్పులేదని ఒకరు కామెంట్ చేస్తే, పోలీసులు ఇటువంటి వారిని కఠినంగా శిక్షించాలని మరికొందరు డిమాండ్ చేశారు.