Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ

జమ్మూ‌కాశ్మీర్‌లోని రియాసీ జిల్లా కత్రాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనేనని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం తేల్చింది.

Katra Bus Fire: కత్రా బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనే: జాతీయ దర్యాప్తు సంస్థ

Nia

Katra Bus Fire: జమ్మూ‌కాశ్మీర్‌లోని రియాసీ జిల్లా కత్రాలో జరిగిన బస్సు అగ్నిప్రమాద ఘటన ఉగ్రవాదుల పనేనని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బృందం తేల్చింది. కత్రాలో యాత్రికులతో వెళ్తున్న బస్సుపై దాడి చేయడానికి ఉగ్రవాదులు ‘అంటుకునే బాంబును’ ఉపయోగించినట్లు దర్యాప్తు వర్గాలు తెలిపాయి. ఎన్ఐఏ దర్యాప్తుకు బలం చేకూర్చుతూ “జమ్మూ కాశ్మీర్ ఫ్రీడమ్ ఫైటర్స్” అనే ఉగ్రవాద సంస్థ ఈఘటనకు బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించింది. వైష్ణోదేవి యాత్రకు బేస్ క్యాంపుగా చెప్పుకునే కత్రాలో శుక్రవారం కొందరు యాత్రికులు బస్సులు వెళ్తుండగా..బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. ఈఘటనలో బస్సులో ఉన్న నలుగురు యాత్రికులు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారు. ప్రమాదంపై స్పందించిన స్థానిక అధికారులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Other Stories: Gun Firing in US: అమెరికాలో మళ్ళీ కాల్పుల కలకలం: 13 మంది మృతి

ఇప్పటికే కాశ్మీర్‌లో అమర్నాథ్ యాత్ర కొనసాగుతుండగా, ప్రస్తుత బస్సు ప్రమాద ఘటన యాత్రపై ఆందోళన కలిగించింది. ఈనేపథ్యంలోనే ఈఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ముమ్మర విచారణ జరిపింది. శనివారం ఘటనా స్థలాన్ని గంటన్నర పాటు పరిశీలించిన దర్యాప్తు బృందం..ఉగ్రవాదులు పేలుడికి ఉపయోగించిన పదార్ధాలను గుర్తించారు. మరోవైపు మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించింది. ఘటనలో గాయపడిన వారికి రూ. లక్ష పరిహారం ప్రకటించింది. దాడి ఘటనలో విచారణ కొనసాగుతోందని..నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షిస్తామని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ (ADG), ముఖేష్ సింగ్ తెలిపారు.