He caught Big snake
Snake Catcher video viral : పాము చాలా విషపూరితమైన జీవి. పాము కాటుకు గురైతే ప్రాణాలను రక్షించుకోవడం కష్టం. అందుకే ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటేనే భయపడతారు. పాము ఉందని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. కొందరు మాత్రం పాములతో ఆడుకుంటారు. ఏ మాత్రం భయపడకుండా పాములను పట్టుకుంటారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు. ఆ వీడియోలో ఓ వ్యక్తి పెద్ద పామును పట్టుకునే ప్రయత్నంలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పామును పట్టుకునే క్రమంలో అది వేగంగా అతనిపైకి కాటు వేసేందుకు దూసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Snakes : వీడి దుంపతెగ.. ప్యాంటులో పాములేసుకుండు.. తరువాత ఏం జరిగిందంటే?
ఈ వీడియోలో ఓ వ్యక్తి పామును బందించే ప్రయత్నంలో అది అతన్ని కాటు వేసేందుకు వేగంగా మీదుకు దూసుకొచ్చింది. అలా పలుసార్లు పాము అతన్ని కాటు వేసేందుకు ప్రయత్నం చేయగా.. అతను చాకచక్యంగా తప్పించుకొని చివరికి పాము గొంతు వద్ద బలంగా పట్టుకొని దానిని అటవీ ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్తాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు బాబోయ్ అంటూ ఆశ్చర్య పోతున్నారు. పామును పట్టుకొనే క్రమంలో ఏమాత్రం అలసత్వం వహించినా దాని కాటుకు బలయ్యేవాడు అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుంగా.. వామ్మో.. ఈ వీడియోను చూస్తుంటే భయమేస్తుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Man grabs snake mid- lunge before it strikes his face pic.twitter.com/Id5SAmGJ0Z
— Visual feast (@visualfeastwang) September 21, 2024
Also Read : Snake Bite Symptoms : పాముకాటుకు గురైన బాలుడి ప్రాణాలను కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు!