Snake Bite Symptoms : పాముకాటుకు గురైన బాలుడి ప్రాణాలను కాపాడిన కిమ్స్ సవీర వైద్యులు!
Snake Bite Symptoms : ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. పాము కాటు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎ. మహేష్ వివరించారు.

Kims Saveera Hospital Doctors Save Snake bite Boy Life Telugu
Snake Bite Symptoms : పాము కాటుతో జాగ్రత్త.. అన్ని పాము కాట్లు ఒకేలా ఉండవు. విషం లేని పాములు కరిచినప్పుడు లేదా విషపూరితమైన పాములు కరిచినప్పుడు ఒకేలా ఉండదు. సాధారణంగా పాము కాటు వేసినచోట గాట్లు పడుతుంటాయి. విషపూరిత పాములు కరిస్తే రెండు గాట్లు పడతాయి. వాపు, నొప్పి కూడా ఉంటాయి. విషం లేని పాములు కరిస్తే అనేక గాట్లు పడతాయి. కొన్నిసార్లు విషపూరిత పాములు కరిచినా గాట్లు కనిపించవు. అదే కట్లపాము కాటేస్తే గాట్లు అసలు కనిపించవు. పాము విష ప్రభావంతో కాటుకు గురైన వారిలో వాంతులు, కడుపునొప్పి, గొంతు నొప్పి లక్షణాలుంటాయి.
Read Also : Heart Health Foods : గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చే అద్భుతమైన 5 ఆహారాలివే..!
ఎక్కువ సమయం గడిస్తే నరాల బలహీనతతో పాటు ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో అది పాము కాటు లక్షణాలనే విషయాన్ని ఇంట్లోవారే కాదు.. వైద్యులు కూడా గుర్తించలేరు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. పాము కాటు గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ ఎ. మహేష్ వివరించారు.
12 ఏళ్ల బాలుడు ఊపిరి ఆడక ప్రాణాలతో పోరాడుతుంటే.. అనంతపురంలో కిమ్స్ సవీరా ఆస్పత్రికి తరలించారు. ఆక్సిజన్ శాచ్యురేషన్ కేవలం 66శాతం మాత్రమే ఉండటంతో చెస్ట్ ఎక్స్‌రే తీయగా న్యుమోనియా లక్షణాలు కనిపించాయి. న్యుమోనియాలో జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు లేవు. ఆక్సిజన్ శాచ్యురేషన్ తక్కువగా ఉండటంతో వెంటిలేటర్ అమర్చారు. అనంతరం చికిత్స ప్రారంభించారు. అయితే, అర్ధరాత్రి 2 గంటలకు బాలుడి తీవ్రమైన కడుపునొప్పి వచ్చింది. వాంతులు అయ్యాయి. తెల్లవారుజామున గొంతు నొప్పిగా అనిపించడంతో స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు.
బాలుడి ఆరోగ్యం విషమించడంతో కిమ్స్ సవీరాకు తరలింపు :
లక్షణాలను బట్టి వైద్యులు బాలుడి పేగుల్లో ఏదో ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించి సంబంధించి కొన్ని మెడిసిన్స్ అందించారు. ఆ మందులు ప్రభావంతో కొద్ది గంటలు బాగానే ఉన్నప్పటికీ ఊపిరి అందక ఆరోగ్యం తీవ్రంగా విషమించింది. ఆ వెంటనే కిమ్స్ సవీరా ఆస్పత్రికి బాలుడిని తరలించారు. ఈ లక్షణాలను చూస్తుంటే బాలుడిని ఏదో పాము కాటేసి ఉంటుందని నిర్ధారణకు వచ్చారు. పాము కాటుకు గురైన వారిలో నోటివెంట నురగలు వస్తాయి.. నరాలు చచ్చుబడిపోవంటి లక్షణాలు ఉంటాయి. కానీ, కొన్ని పాములు కాటు వేస్తే లక్షణాలు మరోలా ఉంటాయని వైద్యులు తెలిపారు.
పాము కాటుగా గుర్తించి వైద్యులు ఆ బాలుడికి పాము విషానికి విరుగుడు ఏఎస్‌వీ ఇంజెక్షన్లు ఇచ్చారు. కాల్షియం ఇచ్చిన రెండు రోజుల తర్వాత బాలుడికి పూర్తిగా నయమైంది. ఆక్సిజన్ శాచ్యురేషన్ కూడా నార్మల్‌కు వచ్చేసింది. వెంటిలేటర్ తొలగించిన అనంతరం రెండు రోజుల్లో డిశ్చార్జి చేశామని డాక్టర్ మహేష్ పేర్కొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు కింద పడుకునే అలవాటు ఉంటే జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పిల్లల్లో ఎవరికైనా తీవ్ర కడుపునొప్పిగా అనిపించడం, వాంతులు, గొంతునొప్పి, నరాల బలహీనత వంటి సమస్యలు ఉంటే అది పాముకాటుగా గుర్తించి సకాలంలో చికిత్స అందించాలని లేదంటే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ మహేష్ సూచించారు.
Read Also : Health Insurance: హెల్త్ ఇన్సురెన్స్ నగదు రహిత చికిత్సలపై ఇకపై గంటలోపే నిర్ణయం.. అంతేకాదు..