Delhi AIIMS లో 30 ఏళ్ల యువకుడికి కరోనా ఇంజక్షన్..ఫలితం ఏమి వచ్చింది

  • Publish Date - July 25, 2020 / 09:21 AM IST

Delhi AIIMS లో కరోనా వైరస్ కు చెక్ పెట్టేందుకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం 3 వేల 500 వాలంటీర్లు రిజర్వేషన్ చేసుకున్నారు. ఇందులో 22 మందికి పరీక్షలు చేశామని, డా.సంజయ్ రాయ్ (Professor at the Centre for Community Medicine at AIIMS) వెల్లడించారు.

ఫేజ్ 1లో భాగంగా 2020, జులై 24వ తేదీ శుక్రవారం 30 ఏళ్ల యువకుడికి Covaxin ఇంజక్షన్ ఇచ్చారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి ముందు..ఆ యువకుడికి అన్ని పరీక్షలు నిర్వహించారు. అంతా ఒకే అనుకున్న అనంతరం టీకాను ఇచ్చారు. మధ్యాహ్నం 1.30 గంటకు 0.5 మి. లీ intramuscular injection ఇచ్చారు. ఇప్పటి వరకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించలేదని, రెండు గంటల పాటు పరిశీలనలో ఉంచారు. రాబోయే ఏడు రోజుల పాటు ఇతడిని పర్యవేక్షిస్తారని డాక్టర్ రాయ్ తెలిపారు.

పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన కొవాక్సిన్ ను హైదరాబాద్ లోని భారత్ బయోటిక్ లో రూపొందించారు. ఐసీఎంఆర్, నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో ఈ వ్యాక్సిన్ ను భారత్ బయోటిక్ రూపొందించింది. క్లినికల్ ట్రయల్స్ కోసం దేశ వ్యాప్తంగా 12 ప్రాంతాలను ఎంపిక చేసింది.

ఇందులో న్యూ ఢిల్లీలోని AIIMS కూడా ఉంది. రెండు దశల ప్రయోగానికి ICMR  ఫర్మిషన్ ఇచ్చింది. తొలి దశలో 375 మంది వాలంటీర్లపై Covaxinను ప్రయోగిస్తారు. ఇందులో 100 మంది వాలంటీర్లు ఎయిమ్స్ నుంచే ఉంటారు. రెండో దశ వ్యాక్సిన్ ప్రయోగాన్ని 12 ప్రాంతాల్లో 750 వాలంటీర్లపై ప్రయోగిస్తారు.

ట్రెండింగ్ వార్తలు