మందుల షాపులో దొంగతనం: నా కూతురికి అనారోగ్యం డబ్బులివ్వండని రిక్వెస్ట్

మందుల షాపులో దొంగతనం: నా కూతురికి అనారోగ్యం డబ్బులివ్వండని రిక్వెస్ట్

Updated On : January 11, 2020 / 12:11 AM IST

డబ్బులు లేని తండ్రి తన కూతురి ఆరోగ్యం కోసం దొంగగా మారాడు. దొంగతనం చేసినా అతని వ్యక్తిత్వం తప్పును ఒప్పుకోమంది. అందుకే అక్కడో లెటర్ పెట్టాడు. అందులో ‘క్షమించాలి నా కూతురు అనారోగ్యంగా ఉంది. ఉన్న డబ్బులు అన్నీ ఇచ్చేయండి. మీకు15సెకన్ల సమయం మాత్రమే ఉంది’ అని రాసి ఉంది. 

ఆ దొంగ ఏ ఆయుధం చూపించకుండానే బెదిరించాడు. అయితే ఆ ఫార్మసీ ఉద్యోగి మాత్రం దొంగ టాబ్లెట్ కవర్లోనే డబ్బులు పెట్టి ఇచ్చేశాడు. ఆ తర్వాత పోలీసులకు 6అడుగులు ఉన్న 30 నుంచి 40ఏళ్ల మధ్య వయస్సున్న వ్యక్తి వచ్చాడని చెప్పాడు. 

పోలీసులు అలాంటి వారి పరిస్థితి అర్థం చేసుకోగలం. కానీ, అవసరాలు తీర్చుకోవడానికి అలాంటి మార్గం ఎంచుకోకూడదు. అలాంటి వారికి ప్రత్యేకమైన సర్వీసులు ఉన్నాయి. దురదృష్టవశాత్తు అతను దీనిని ఎంచుకున్నాడు. అతన్ని పట్టుకుని తీరతాం’ అని వెల్లడించాడు.