Delhi Station : వణుకు పుట్టించే వీడియో, కదులుతున్న రైలు ఎక్కబోయాడు..కాపాడిన పోలీసు

ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కొద్దిగా రద్దీ నెలకొంది. కొంతమంది రైలు ఎక్కేందుకు నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో బ్యాగులు పట్టుకుని రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఈ సమయంలో..రైలు కదులుతోంది.

Delhi Station : వణుకు పుట్టించే వీడియో, కదులుతున్న రైలు ఎక్కబోయాడు..కాపాడిన పోలీసు

Delhi

Updated On : July 25, 2021 / 6:00 PM IST

Moving Train : కదులుతున్న రైలు ఎక్కకూడదని, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దని రైల్వే శాఖ, రైల్వే పోలీసులు ఎన్నిమార్లు సూచిస్తున్నా కొంతమంది నిర్లక్ష్యం వహిస్తున్నారు. తొందరగా వెళుదామని అనుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కదులుతున్న రైలు ఎక్కబోయి పలువురు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే.. కొన్ని సందర్భాల్లో అక్కడున్న పోలీసులు సాహసం చేసి..వారిని కాపాడుతున్నారు. తాజాగా..ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఇదే తరహా ఘటన చోటు చేసుకుంది.

ఢిల్లీ కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ ప్రయాణీకులతో కొద్దిగా రద్దీ నెలకొంది. కొంతమంది రైలు ఎక్కేందుకు నిరీక్షిస్తున్నారు. ఇదే సమయంలో ఇద్దరు వ్యక్తులు చేతుల్లో బ్యాగులు పట్టుకుని రైల్వే స్టేషన్ కు వచ్చారు. ఈ సమయంలో..రైలు కదులుతోంది. ఓ వ్యక్తి భుజాన ఓ బ్యాగు, రెండు చేతులతో బ్యాగులు పట్టుకుని రైలు ఎక్కేందుకు రన్నింగ్ చేశాడు.

ఇతని వెనుకాలే ఉన్న మరో వ్యక్తి చేతుల్లో కూడా రెండు బ్యాగులున్నాయి. ఇతను ఓ బోగీలో ముందుగా బ్యాగు పెట్టేసి ఎక్కుదామని ప్రయత్నించాడు. ఇదంతా అక్కడనే ఉన్న RPF CT Rajvir Singh గమనించసాగాడు. రైలు ఎక్కబోయి అమాంతం కూలాడు. రైలు, ప్లాట్ ఫాం మధ్యలో ఇరుక్కపోయాడు. వెంటనే గమనించిన..RPF CT Rajvir Singh పరుగున వెళ్లి…పక్కకు లాగేందుకు ప్రయత్నించాడు.

కానీ వీలు కాలేదు. అతని చేతులు ఇరుక్కపోవడంతో..రైలు లాక్కెళ్లిపోయింది. అయినా…కానిస్టేబుల్ ప్రయత్నించి..బలంగా పక్కకు లాగేశాడు. దీంతో అతను బతికిపోయాడు. ధైర్యంగా సాహసం చేసి వ్యక్తిని రక్షించిన పోలీసుపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.