Punjab Man Stabs: మాజీ ప్రేయసి ఆపీస్‌కు వెళ్లి కత్తితో 20సార్లు పొడిచి హత్య.. ఆ తరువాత తాను కత్తితో పొడుచుకొని..
Man stabs ex-girlfriend : మాజీ ప్రేయసిని కార్యాలయంలోనే 20సార్లకు పైగా కత్తితో పొడిచిన యువకుడు.. అనంతరం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో చోటు చేసుకుంది.
Man Stabs Ex Girlfriend Inside Office After Break Up Later Attempts Suicide
Punjab Man Stabs: మాజీ ప్రేయసిని కార్యాలయంలోనే 20సార్లకు పైగా కత్తితో పొడిచిన యువకుడు.. అనంతరం ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీలో చోటు చేసుకుంది. ప్రేమ విఫలమవడంతో ఓ యువకుడు అత్యంత దారుణానికి పాల్పడ్డాడు. తన మాజీ ప్రేయసిపై కక్ష పెంచుకున్న అతడు ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వెళ్లి 20 సార్లకు పైగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం అదే కత్తితో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పోలీసుల వివరాల ప్రకారం.. 30ఏళ్ల డింపుల్ మొహాలీలోని సెక్టార్-66లో ఉన్న ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తోంది. గతంలో ఆమెకు హర్జిందర్ సింగ్ మాన్‌తో ప్రేమ సంబంధం ఉండేది. అయితే కొంతకాలం క్రితం ఇద్దరూ విడిపోవడంతో హర్జిందర్ సింగ్ మాన్ తీవ్ర అసహనానికి గురైనట్లు తెలుస్తోంది.
గురువారం సాయంత్రం కార్యాలయానికి చేరుకున్న నిందితుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
గురువారం సాయంత్రం కార్యాలయానికి చేరుకున్న నిందితుడు మహిళతో వాగ్వాదానికి దిగాడు. మాటామాటా పెరగడంతో తన వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మహిళపై 20 సార్లకుపైగా కత్తిపోట్లు పొడవడంతో ఆమె తీవ్ర రక్తస్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందింది.
ఘటన అనంతరం నిందితుడు కూడా అదే కత్తితో తనను తాను గాయపరుచుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. స్థానికులు అతన్ని అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడు చికిత్స పొందుతున్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రేమ వ్యవహారం, విడిపోవడానికి గల కారణాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేపట్టారు. మాజీ భాగస్వాముల మధ్య తలెత్తే వివాదాలు ఎంతటి విషాదాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
